Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-05-2023 తేదీ సోమవారం దినఫలాలు - ఈశ్వరుడిని ఆరాధించిన సర్వదా మీకు శుభం...

Webdunia
సోమవారం, 1 మే 2023 (04:00 IST)
మేషం :- ఆర్థికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. మీ కుటుంబీకుల ఆరోగ్యంలో మెళకువ వహించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. షేర్లక్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. మొక్కుబడులు చెల్లిస్తారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి.
 
వృషభం :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడికానవస్తుంది. దేవాలయ విద్యా సంస్థలకు దాన ధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు.
 
మిథునం :- ఆర్థికస్థితిలో ఏమాత్రం పురోభివృద్ధి ఉండదు. దంపతుల మధ్య నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన పెరుగుతుంది.
 
కర్కాటకం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సాహస ప్రయత్నాలు విరమించండి. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం.
 
సింహం :- ఆలయాలను సందర్శిస్తారు. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. మీ రాక బంధువులకు ఆనందాన్ని ఇస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం.
 
కన్య :- ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. బంధు మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. భార్యా భర్తల మధ్య అవగాహన అవసరం. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. పీచు, ఫోం, లెదర్ వ్యాపారులకు కలసిరాగలదు.
 
తుల :- ప్రయాణాల్లో కొంత అసౌకర్యం తప్పకపోవచ్చు. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. సంతానాభివృద్ధి బాగుంటుంది. ఉమ్మడి వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం.
 
వృశ్చికం :- నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. సన్నిహితులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. చిన్నతరహా పరిశ్రమల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సజావుగా సాగుతాయి.
 
ధనస్సు :- ప్రేమికులకు తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామిక చర్చలు, కీలకమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. రాబడికి మించిన ఖర్చులుంటాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది.
 
మకరం :- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. టెక్నికల్, లా, మెడికల్ విద్యార్థులలో నూతనోత్సాహం కానవస్తుంది. ఖర్చుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించండి. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించటం మంచిది. బంధు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల పెద్దలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏ.సి. రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. చల్లని పానీయ, కూరగాయల వ్యాపారులకు కలిసిరాగలదు.
 
మీనం :- సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. మీ సంతానం విలాసాల కోసం ధనవ్యయం చేస్తారు. కళా, క్రీడా రంగాల్లో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు సదావకాశాలు చేజారిపోతాయి. మీకోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

లేటెస్ట్

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

తర్వాతి కథనం
Show comments