Webdunia - Bharat's app for daily news and videos

Install App

27-09-2020 ఆదివారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణం చేస్తే..

Webdunia
ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (05:00 IST)
మేషం : మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వేళతప్పి ఆహారం భుజించుటవల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, మెళకువ అవసరం. 
 
వృషభం : గతంలో ఒకరికచ్చిన హామీవల్ల వర్తమానంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలుపెడతారు. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళకువ ఏకాగ్రత అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విదేశీయానం, రుణయత్నాలు ఫలిస్తాయి. 
 
మిథునం : ఇతరులపై ఆధారపడక మీ వ్యవహారాలు స్వయంగా సమీక్షించుకోవడం క్షేమదాయకం. స్త్రీలకు బంధువుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మికసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : స్త్రీలకు అర్జన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కొంతమంది మీ నుంచి ధనం ఆశిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత ప్రయాసలు తప్పవు. 
 
సింహం : కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు లాభదాకయంగా ఉంటుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ చాలా అవసరం. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. బధువులను కలుసుకుంటారు. 
 
కన్య : దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. పెద్దల ఆరగ్యం గురించి ఆందోళన చెందుతారు. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
తుల : రవాణా రంగాల వారికి ప్రయాణికులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికైచేయు యత్నాలు ఫలిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృశ్చికం : ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు ఉంటాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. గృహమునకు కావలసిన వస్తువులు అమర్చుకుంటారు. స్త్రీలకు అయినవారి నుంచి ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. పాత శత్రువులు మిత్రులుగా మారతారు. 
 
ధనస్సు : ఉద్యోగస్తులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ శ్రీమతి సలహా పాటించకపోవడం వల్ల చికాకులు తప్పవు. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే మీ ఆలోచన బలడుతుంది. మీ మంచితనాన్ని త్వరలోనే కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. 
 
మకరం : ఇతరులపై ఆధారపడక మీ వ్యవహారాలు స్వయంగా సమీక్షించుకోవడం క్షేమదాయకం. హోల్‌సేల్ కంటే రిటైల్ వ్యాపారాలే బాగుంటాయి. దైవ, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. మీ సంతానానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. 
 
కుంభం : స్త్రీలకు బంధువుల తీరు ఆందోళన కలిగిస్తుంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది.
 
మీనం : రాబడికి మంచిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. బంధువుల రాక వల్ల చేపట్టిన పనులు అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. వ్యవహారాల్లో జయం, వాహనయోగం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. దూర ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్... నిర్మలా సీతారామన్

అఖాడా నుంచి మమతాకులకర్ణి - లక్ష్మీనారాయణ్‌ ఔట్...

విత్తమంత్రి నిర్మలమ్మ ధరించిన చీర ప్రత్యేక ఏంటో తెలుసా?

ప్రియురాలి జల్సాల కోసం చైన్ స్నాచర్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు..

చరిత్రలో తొలిసారి.. పూనమ్ గుప్తా వివాహానికి వేదిక కానున్న రాష్ట్రపతి భవన్

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..

30-01-2025 గురువారం దినఫలితాలు : ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

మౌని అమావాస్య వేళ త్రివేణి యోగం.. ఈ మూడు రాశులకు లాభాలు

29-01-2025 బుధవారం దినఫలితాలు : పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

తర్వాతి కథనం
Show comments