Webdunia - Bharat's app for daily news and videos

Install App

10-11-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే...

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (05:00 IST)
మేషం : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు, నిర్మాణ పనులో ఏకాగ్రత అవసరం. ప్రముఖుల కలయికతో పనులు సానుకూలమవుతాయి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు.
 
వృషభం : కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో క్రమేణా నిలదొక్కుకుంటారు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యపడుతుంది. కోర్టు వ్యహహారాలలో పనులు వాయిదాపడతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
మిథునం : మీరు చేసిన ఉపకారానికి ప్రశంసలు లభిస్తాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి సమర్థులైన పనివారలు దొరకడం కష్టమవుతుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకుల కలిగిస్తుంది. అవివాహితులతో నూతనోత్సాహం, పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. 
 
కర్కాటకం : పారిశ్రామిక రంగాల వారికి ఆభ్యంతరాలు, కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రతం ముఖ్యం. సొంత వ్యాపారాలు, పరిశ్రమలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. నిత్యావసర వస్తు వ్యాపారులకు, డీలర్లకు ఊహించని చికాలు తలెత్తుతాయి. 
 
సింహం : మీరెదురు చూస్తున్న అవకాశం అసంకల్పితంగా మీ చెంతకే వస్తుంది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్ల శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. వివాహ, ఉద్యోగ యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. వాహనం అమర్చుకోవాలన్న మీ కోరిక నెరవేరుతుంది. 
 
కన్య : ధనం నిల్వచేయాలనే మీ యత్నం వాయిదాపడుతుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ అభిరుచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
తుల : ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోవనవుతారు. ఆర్థిక సంస్థల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. ఇతరులకు సలహాలిచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహన చోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఉపాధ్యాయులకు బాధ్యతలు అధికం. 
 
వృశ్చికం : స్త్రీలు తమ ఆరోగ్యంలో స్వల్ప తేడాలు గమనిస్తారు. రావలసిన ధనం చేతికందే సూచనలు ఉన్నాయి. సోదరీ, సోదరుల మధ్య చిన్న చిన్న కలహాలు, అభిప్రాయభేదాలు తప్పవు. వ్యాపార రహస్యాలు కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. ఉపాధ్యాయ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. 
 
ధనస్సు : విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. పాత వస్తువులు కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలించగలవు. ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ఫైనాన్స్, చిట్స్ రంగాల్లో వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. 
 
మకరం : ప్రియతముల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. మొండిబాకీలు వసూలవుతాయి. గృహంలో మరమ్మతులు చేయించగలుగుతారు. కుటుంబీకులతో కలిసి దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
కుంభం : స్త్రీలకు దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వైద్యులకు ఒత్తిడి, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి చికాకులు తప్పదు. క్రీడా రంగాలలోని వారికి చికాకులు తప్పవు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు వ్యయ, ప్రయాసలు తప్పవు. విద్యార్థులు సరదా, కాలక్షేపాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
మీనం : ఉపాధ్యాయులకు మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ సంతానం అభివృద్ధి విషయంలో మీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. కుటుంబీకులతో సరదాగా గడుపుతారు. నూతన వ్యాపారాలకై చేయు యత్నాలు ప్రగతి పథంలో నడుస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments