Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుప్తవజ్రాసనం

Webdunia
శనివారం, 8 మే 2010 (19:29 IST)
ఆసనం వేయు విధానం :-
1. ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి.
2. కుడి మరియు ఎడమ మోచేతులను శరీరానికి ఇరువైపులా సమానంగా ఉండేలా నెమ్మదిగా వెనుకవైపు నేలమీద ఉంచాలి.
3. మోచేతి భాగం నుంచి చేతి వ్రేళ్ల వరకు నిటారుగా ఉంచి నెమ్మదిగా శరీరాన్ని వెనుకకు వంచాల ి.
4. ఇప్పుడు భుజాలు నేలను తాకుతూ ఉండాలి. ప్రాధమిక దశలో ఉన్నవారైతే రెండు చేతులను తొడలపై ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఆ చేతులను మోకాలివరకు సమానంగా తీసుకురావాలి.
5. ఈ స్థితికి బాగా అలవాటు పడిన తర్వాత రెండు చేతులను కత్తెర ఆకారంలో ఉండేలా భుజాల కింద ఉంచాలి. కుడి చేయి ఎడమ భుజం కింద... అలాగే ఎడమచేయి కుడి భుజం కింద ఉంచాలి. రెండింటి మధ్య తలభాగం ఉండేలా చూసుకోవాలి.
6. తిరిగి వాస్తవిక స్థితికి వచ్చే సమయంలో, మొదటగా రెండు చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి.
7. తర్వాత మోచేతుల సాయంతో తొలుత ఉన్న స్థానానికి నిదానంగా వచ్చేయాలి.

WD
గుర్తుంచుకోవలసినవి :-
1. మీ శరీరాన్ని వెనుకకు వంచే సమయంలో శరీర బరువును నియంత్రిస్తూ ఎలాంటి కుదుపులు లేకుండా నెమ్మదిగా చేయాలి. లేనిచో కండరాల నెప్పి వంటి సమస్యలు తలెత్తును.
2. ఈ ఆసనాలు వేసేప్పుడు ఏదైనా కష్టంగా అనిపించినట్లు.. లేదా సమస్యగా అనిపించినట్లు ఉంటే.. యోగసాధకులు ఈ ఆసనాన్ని వెయ్యకపోవడమే మంచిది.
3. ప్రాధమిక దశలో ఉన్న యోగసాధకులు... ఈ ఆసనంలో మోకాళ్లను దగ్గరగా ఉంచుకోవటం కష్టమనిపిస్తే కాస్త దూరదూరంగానైనా ఉంచుకోవచ్చు.

ప్రయోజనాలు, పరిమితులు :-
1. ఉదరసంబంధిత కండరాలను చైతన్య పరుచును.
2. తుంటి నొప్పి, అధికరక్తపోటు వంటి సమస్యలు ఉన్న వారికి ఈ ఆసనం సాయపడును.
3. మలబద్ధకము వంటి సమస్యలకు ఈ ఆసనం ఉత్తమం.

జాగ్రత్తలు :-
తొడ యొక్క పైభాగములో నొప్పి మరియు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు గలవారు ఈ ఆసనాన్ని చేయరాదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments