Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగాసనాలు వేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఐవీఆర్
సోమవారం, 12 ఆగస్టు 2024 (21:04 IST)
ఆసనాలు వేసే ముందు కొన్ని జాగ్రత్తలు విధిగా పాటించాల్సి వుంటుంది. అవి ఆసనాలకు మీరు కేటాయించే సమయం. తర్వాత ప్రాణాయామం, ధ్యానంకు నిర్దేశించుకున్న సమయం. ఇందుకు సంబంధించి ప్రతి రోజు యోగాకు గంట సమయం కేటాయించండి. దానిలో అరగంట ఆసనాలకు, పది నిమిషాలు ప్రాణాయామం, ఇరవై నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితాలను చూస్తారు. 
 
ఆసనాలు వేస్తున్నాం కదా.. అని ఇప్పటికే మీరు వాడుతున్న మందులు, వైద్యులను సంప్రదించటాన్ని మాత్రం మానకండి. తర్వాత ఆసనాలు వేసే విషయంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరిలోని యోగ మాష్టారును సంప్రదించి ఆసనాలను మీరు సరిగా వేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి. ఆసనాలు వేసే ముందు మనం కొన్ని అంశాలను పాటించాల్సివుంది.
 
* ఎనిమిది నుంచి 60 సంవత్సరాల వాళ్లు మాత్రమే యోగా చేయాలి. 
* తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాతే యోగాసనాలు వేయాలి. 
* ఆసనాలు వేసే ముందుగా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. 
* తెల్లవారుజామునే ఆసనాలు వేయండి. ఆ సమయంలో గాలిలో ప్రాణ శక్తి ఎక్కువగా వుంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని వేయండి.
* శబ్దాలు, గోలలు లేకుండా వుండే ప్రదేశాన్ని ఎన్నుకోండి. 
 
* పలుచటి బట్ట నేలపై పరిచి పద్మాసనం లేదా సుఖాసనం లేదా మీకు ఇష్టమైన ఆసనాన్ని వేయండి. 
* ప్రశాంతంగా కనులు మూసుకోండి. 
* మీ ధ్యాస శ్వాసమీదే నిలపాలి. 
* గాలి వదిలినప్పుడు పొట్ట లోపలకు, పీల్చినపుడు ముందుకు వస్తుందో లేదో గమనించండి. (దీనికై, పొట్ట ద్వారా కాకుండా, ఛాతీ ద్వారా గాలి పీలుస్తుంటే మాత్రం మీ శ్వాస సరి కాదని గుర్తించాలి.)
* ఆసన ప్రారంభ సమయంలో పద్మాసనం, వజ్రాసనం ఏదైనా వేయండి.
 
* ఆసనం ఎప్పుడూ నెమ్మదిగా వేయాలి. ఏమాత్రం తొందర పడొద్దు. 
* వేసిన ఆసనంలో కొద్ది సెకన్ల పాటు అలాగే వుండాలి. 
* ఆసనం వేసేటపుడు ఎంత నెమ్మదిగా వేస్తామో అంతకంటే నెమ్మదిగా మామూలు స్థానంలోకి రావాలి. 
* కుంభకం వేసేటపుడు అధిక రక్తపోటు ఉన్నవారు కేవలం పది సెకన్లు మాత్రమే వేయాలి. 
* గాలి పీల్చటం, వదలటం వంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలటం, పీల్చటం చేయకూడదు. ప్రతిదీ నెమ్మదిగా, సరళంగా ప్రశాంతంగా చేయాలి.
* ఏ ఆసనం అయినా సరే రొప్పుతూ, ఆయాస పడుతూ చేయకండి. మీ శరీర సామర్థ్యాన్ని గుర్తించి అంత సేపే ఉండండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments