Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీపీ ఉందా... ప్రణాయామం చేయండి

Webdunia
బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ (బీపీ). దీనినే హైపర్ టెన్షన్ అనికూడా అంటారు. హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు సాధారణమైన యోగాసనాలు చేయవచ్చు. ఇవి చేసేటప్పుడు ఆయాసం రాకుండా చూసుకోవడం ఎంతో ఉత్తమం. బీపీ ఉన్నవారు వేయకూడని ఆసనాలు కొన్నివున్నాయి. ఉదా:- పశ్చిమోత్తాసనము, పాదహస్తాసనం, శీర్షాసనం, సర్వాంగాసనాలు వేయకూడదు.

కారణం ఈ ఆసనాలు వేస్తే రక్తం అధికంగా తల లోపలికి ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాలు వేయకూడదు. ఇలాంటి ఆసనాలు వేస్తే తలలోని రక్తనాళాలు చిట్లే అవకాశంవుందని పరిశోధనలు చెబుతున్నాయి. బీపీ తగ్గడంకోసం చేస్తున్న ఏ ఆసనం వేస్తున్నప్పుడయినా సరే మీకు కాస్త అలసటగా అనిపిస్తే వెంటనే శవాసనం వేయడం అత్యుత్తమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

శవాసనంలో వీలయినంత సేపు ఉండడంకోసం మీ శ్వాసని లెక్క పెట్టడం మొదలు పెట్టి గాలి బయటకు వెళ్ళినప్పుడు పొట్ట లోపలికి వెళుతుంది. అప్పుడు ఒకటి అని లెక్కపెట్టి మళ్ళీ పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు రెండు అని లెక్కపెడుతూ 10 వరకు లెక్క పెట్టి మళ్ళీ 10 నుంచి 1 వరకు లెక్కపెడితే చాలా తొందరగా రిలాక్స్ అవుతారని వ్యాయామ పరిశోధకులు పేర్కొన్నారు.

శవాసనం ప్రతిరోజూ 10 నిమిషాలు చేయటంవలన అధిక బీపీ ఉన్నవారిలో అత్యుత్తమమైన ఫలితాలు వస్తాయని పరిశోధకులు తెలిపారు. ప్రాణాయామంలో ముఖ్యమైనవి డయాప్రమేటిక్ బ్రీథింగ్‌ను గమనించడం.

సుఖ ప్రాణాయామం, భారీ ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం ప్రతి రోజూ చేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడంవలన అధిక బీపీ తగ్గడమే కాకుండా సీరమ్ లిపిడ్స్‌లో మంచి మార్పులు సంభవించాయని వారు పేర్కొన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

Show comments