Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిని పంచుకుందాం... రండి!!

Webdunia
WD
అంతర్జాతీయ జల దినోత్సవం ప్రతి ఏటా మార్చి 22న జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకించి మంచినీటి యొక్క ప్రాముఖ్యత, నీటిని ఎలా పొదుపుగా వినియోగించుకోవాలనే అంశాలపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

1992 లో తొలిసారిగా యునైటెడ్ నేషన్స్ కాన్ఫెరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ & డెవలప్‌మెంట్ మంచినీటికి సంబంధించి అంతర్జాతీయంగా అవగాహనను విస్తృతం చేయాలని సిఫార్సు చేసింది. దీంతో ప్రతి ఏటా మంచినీటిపై ఈ అంతర్జాతీయ నీటి దినోత్సవం రోజున ప్రత్యేకంగా కొన్ని అంశాలపై దృష్టి సారించడం జరుగుతోంది.

ఈ అంతర్జాతీయ జల దినోత్సవ సందర్భంగా "నీటిని పంచుకుందాం - ఆ అవకాశాలు పంచుకుందాం" అంటూ నినదిస్తోంది యునెస్కో. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జల వనరులను సద్వినియోగం చేసుకుని సుఖమయ జీవనాన్ని సాగించాలని యునెస్కో పిలుపునిస్తోంది. ముఖ్యంగా జలవనరులు కలిగిన దేశాల నీరు వృధా పోకుండా పొరుగు దేశాలకు సాయపడగల యోచన చేయాలంటోంది.

అలాగే ఆయా దేశాల్లోని రాష్ట్రాలు ఇప్పటికే నీటి కోసం కొట్లాడుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. వెంటనే జల పోరాటాలను ఆపి ఆమోదయోగ్యమైన మార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిస్తోంది. పరస్పర అవగాహన ద్వారా ఇది సుసాధ్యం చేసుకోవాలని అంటోంది. మానవుల అవసరాలకు ప్రకృతి ప్రసాదించిన జల వనరులను వృధా పోనివ్వక, కాలుష్యం చేయక పొదుపుగా వాడుకోవాలని ఈ సందర్భంగా యునెస్కో వెల్లడించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments