Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా పార్లమెంటేరియన్లదే పై చేయి

Webdunia
ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్న మహిళల సంఖ్య ఈ సంవత్సరం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే జాతీయ స్థాయి చట్టసభల్లో పురుషులతో సమానమైన వాటాను పొందడంలో మహిళ పార్లమెంటేరియన్ల సంఖ్య గణనీయమైన స్థాయిలో లేదని ఇటీవల విడుదల చేసిన తన వార్షిక నివేదికలో అంతర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) పేర్కొంది. ప్రస్తుతం పార్లమెంట్‌లలో మహిళా సభ్యుల సంఖ్య 17.7 శాతానికి చేరుకుందని ఐపీయూ ప్రధాన కార్యదర్శి ఆండర్స్ జాన్సన్ శనివారం మీడియాతో అన్నారు. 2005 సంవత్సరం ముగిసేనాటికి ఈ శాతం 16.3 కాగా డిసెంబర్ 2004 నాటికి 15.7 శాతంగా నమోదైందని వెల్లడించారు.

" ఇది పురోగతిగా పేర్కొనవచ్చు. కానీ మరింత లోతుగా అధ్యయనం చేసినట్లయితే పురోగతి మందకొడిగా సాగుతోందని" జాన్సన్ అన్నారు. అయితే పార్లమెంట్‌లో లింగ సమానత్వం సాధించడమనది బహుదూరంలో గల గమ్యస్థానమని, సమీప భవిష్యత్తులో సాధ్యం కానిదిగా జాన్సన్ తేల్చి చెప్పారు. "ప్రస్తుత శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2050 సంవత్సరం కంటే ముందుగా పార్లమెంట్‌లో లింగ సమానత్వాన్ని సాధించలేమని" జోస్యం చెప్పారు. పార్లమెంట్లలో మహిళల సంఖ్య హీనపక్షం 30 శాతంగా ఉండాలని 1995 సంవత్సరం బీజింగ్‌లో జరిగిన యూఎన్ మహిళా సదస్సు లక్ష్యాన్ని నిర్దేశించింది.

అయితే ఐపీయూ అందించిన సమాచారాన్ని అనుసరించి 2005 సంవత్సరాంతానికి కేవలం 20 దేశాల్లోని దిగువ సభల్లో మాత్రమే మహిళల సంఖ్య 30 శాతానికి చేరుకుందని తెలియవచ్చింది. అందులో నాలుగు దేశాలు 40 శాతాన్ని అధిగమించాయి. అత్యధిక శాతం మహిళా సభ్యులు కలిగిన దేశంగా 48.8 శాతంతో రువాండా మొదట స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాన్ని వరుసగా 47 శాతం, 41.5 శాతం మరియు 40 శాతంతో స్వీడన్, ఫిన్లాండ్ మరియు అర్జెంటీనా దేశాలు కైవసం చేసుకున్నాయని ఐపీయూ తన వార్షిక నివేదికలో పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అర్థభాగాన్ని ఆక్రమించుకున్న కోస్టారికా, క్యూబా, మొజాంబిక్, దక్షిణాఫ్రికా, ఉగాండా, బురుండీ మరియు టాంజానీయా దేశాలు తమ పార్లమెంట్లలో మహిళలకు 30 శాతం స్థానాలను కట్టబెట్టాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

Show comments