Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డకు తల్లిపాలు చాలట్లేదా...! చిట్కాలు మీ కోసం...!

Webdunia
బుధవారం, 24 డిశెంబరు 2014 (14:39 IST)
కన్న బిడ్డకు తల్లిపాలు పట్టించడం చాలా అవసరం. తల్లి పాలు తాగడం వల్ల పుట్టిన బిడ్డ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కనుక బిడ్డకు కనీసం ఆరు నెలలు నిండే వరకైనా తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే కొంత మంది స్త్రీలకు బిడ్డకిచ్చే పాలు తక్కువగా వస్తాయి. ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటించి బిడ్డకు సరిపడ పాలను పట్టించవచ్చు.
 
బిడ్డకు పాలు సమృద్ధిగా అందాలంటే తల్లి బలమైన పోషక ఆహారం తీసుకోవాలి. మంచి ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్లు, ఐరన్ కల ఆహారం తినాలి. ప్రొటీన్లు ఎక్కువగా లభ్యమయ్యే పాలు, గుడ్లు, మాంసం, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. 
 
అదేవిధంగా విటమిన్ ఎ ఎక్కువగా ఉండే క్యారెట్, గుమ్మడి వంటి కాయకూరలు తినాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఉడికించిన బఠాణీలు, బీన్స్, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. పోలెట్ అధికంగా లభ్యమయ్యే ఆకు కూరలు ఎక్కువగా తినాలి. పండ్లు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా తల్లి నుంచి బిడ్డకు కావలసినన్ని పాలు చిక్కుతాయి. 
 
బిడ్డకు పాలిచ్చే తల్లులు మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, తీసుకోరాదు. వారి కోసం వండే ఆహార పదార్థాల్లో మసాలాలు తగ్గించి, సువాసననిచ్చే కొత్తమీర, దాల్చిన చెక్క ఉపయోగించరాదు. ఇటువంటివి వాడితే ఆ సువాసన ఘాటు బిడ్డకు ఇచ్చే తల్లిపాల రుచిని మారుస్తుంది. తద్వారా బిడ్డ పాల సరిపడినన్నితాగలేదు.
 
ముఖ్యంగా బిడ్డకు పాలిచ్చే మహిళలు మద్యం సేవించడం, పొగాకు తీసుకోవడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇవి పాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి ప్రభావం బిడ్డపై పడే ప్రమాదం లేకపోలేదని వైద్యులు పేర్కొంటున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments