Webdunia - Bharat's app for daily news and videos

Install App

2,271 లీటర్ల తల్లిపాలను దానంగా ఇచ్చిన అమెరికా మహిళ...

అమెరికాలో ఓ మహిళ 2,271 లీటర్ల తల్లి పాలను దానంగా అందజేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఎలిజబెత్ ఆండర్సన్ అనే మహిళ ఇప్పటిదాకా 2, 271 లీటర్ల తల్లిపాలను విరాళంగా ఇచ్చింది. సాధారణ బాలింతకంటే ప

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (13:49 IST)
అమెరికాలో ఓ మహిళ 2,271 లీటర్ల తల్లి పాలను దానంగా అందజేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఎలిజబెత్ ఆండర్సన్ అనే మహిళ ఇప్పటిదాకా 2, 271 లీటర్ల తల్లిపాలను విరాళంగా ఇచ్చింది. సాధారణ బాలింతకంటే పది రెట్లు ఎక్కువగా ఎలిజబెత్‌కు తల్లిపాలు లభిస్తుందని.. దీన్ని వృధా చేయకుండా విరాళంగా అందజేస్తున్నట్లు తెలిపింది.
 
రోజుకు 6.4 లీటర్ల తల్లి పాలను పొందే ఎలిజబెత్.. రోజుకు ఐదు సార్లు పాలను తీసి.. పాకెట్లలో భద్రపరిచి.. ఫ్రిజ్‌లో పెట్టేస్తుంది. ఆపై ఆ పాలను ఉచితంగా శిశువులకు అందజేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడే వ్యాధిగ్రస్థులకు జన్మించిన శిశువులకు, పోషకాహార లేమితో బాధపడే శిశువులకు.. ఇంకా తల్లి పాలు అవసరమయ్యే వారికి ఈ పాలను ఉచితంగా ఇస్తుంది. 
  
ఇకపోతే.. ఆండర్సన్‌కు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ ద్వారా అధిక తల్లి పాలు లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే ఆమెకు రెండున్నరేళ్ల పాప వుంది. రెండో పాప పుట్టి ఆరు నెలలే కావడంతో తనకు లభించే అధిక తల్లిపాలను దానం చేయడం ద్వారా అనేకమంది చిన్నారులకు మేలు చేసినట్లవుతుందని ఆమె భావిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments