Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమూ మీ వెంటేనంటున్న కమలసఖులు... ఏంటి సంగతి?

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (18:16 IST)
ఇంటిలోనే కాదు.. ఇంటి బయట కూడా తమ భర్తలకు సహకారం అందించాలనుకున్నారు నారీమణులు. ఆలోచన వచ్చిందే తడవుగా చకచకా ఓ సంస్థను ఏర్పాటు చేసేశారు. సంస్థ పేరు కమల సఖి. ఇదేదో బీజేపీకి అనుబంధ సంస్థలా వుందనుకుంటున్నారా! ఖచ్చితంగా అదేనండోయ్!
 
బీజేపీ ఎంపీల సతీమణులంతా కలిసి ఏర్పాటు చేసిన సంఘమిది. భర్తకు రాజకీయంగా చేదోడువాదోడుగా ఉంటూ వివాదాలకు దూరంగా నడిపించడం సభ్యుల లక్ష్యమట. అంతటితోనే ఆగరట.. స్వచ్ఛంద సేవ కూడా చేస్తామంటున్నారు. ఇందులో బీజేపీ మహిళా ఎంపీలు కూడా సభ్యులుగా వున్నారు. కొన్ని నిర్ధిష్టమైన విధివిధానాలతో కార్యాచరణ కూడా ప్రకటించారు. 
 
ముఖ్యంగా తమతమ భర్తలకు రాజకీయంగా చేదోడువాదోడుగా ఉండి వివాదాలకు దూరంగా ఉండేలా నడిపించడం వీరి ప్రధాన కర్తవ్యం. ఇక మీడియాతో మాట్లాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్టింగ్‌ ఆపరేషన్ల బారిన పడకుండా తమ భర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకున్నారట కమలసఖి సభ్యులు.
 
ఈ సమావేశానికి 30 మందికి పైగా ఉన్న బీజేపీ మహిళా ఎంపీలు కూడా హాజరయ్యారు. ఇందులో అనేక అంశాలపై సభ్యుల నుంచి పలు కీలక సూచనలు వచ్చాయి. నియోజకవర్గాల్లో ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. మహిళా సంఘాలను ప్రోత్సహించి వారికి సర్కార్‌ నుంచి అవసరమైన సాయం అందేలా చూడాలనుకుంటున్నారు.
 
మొత్తానికి ఎంపీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భర్తకు అండగా ఉండాలన్న కమలసఖి సభ్యుల ఆలోచనను బీజేపీ నేతలు ఆహ్వానిస్తున్నారట. అభివృద్ధిలో మీరు కూడా భాగం కావాలంటూ మరింత ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కమలసఖి సంపూర్ణంగా వికసిస్తుందా? ఒకటి రెండు సమావేశాలకు పరిమితమవుతుందో చూడాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

ఏపీలో ట్రాన్స్‌మీడియా సిటీ.. 25,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది.. చంద్రబాబు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

Show comments