శెనగపిండి, పెరుగుతో ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (14:55 IST)
స్త్రీ పురుషులు ఎదుర్కునే సమస్యల్లో మెుటిమల సమస్య కూడా ఒకటి. ముఖంపై మెుటిమలు వచ్చాయంటే.. వాటిని ఎలా తొలగించాలి దేవుడా అంటూ తికమకపడుతుంటారు. రకరకాల నూనెలు, క్రీములు ముఖానికి రాస్తుంటారు. అయినప్పటికీ మెుటిమలు తగ్గలేందంటూ.. బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ కింది చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.. అవేంటంటే..
 
1. గులాబీ రేకులు ఆరోగ్యానికి ఎలా పనిచేస్తాయో ఈ సమస్యకు కూడా అంతే ఉపయోపడుతాయి. కొన్ని గులాబీ ఆకులు, బచ్చలి ఆకులను పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత 5 నిమిషాల పాటు మర్దన చేసి ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే మెుటిమ సమస్య పోతుంది. 
 
2. దోసకాయ తొక్కలను పేస్ట్ చేసి అందులో కొద్దిగా పసుపు, మెంతుల పొడి, టమోటా రసం కలిపి ముఖానికా ప్యాక్ వేసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై మెుటిమలు తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది. 
 
3. శెనగపిండి వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటారు. మరి ఇది అందానికి ఎలా పనిచేస్తుందో చూద్దాం.. శెనగపిండిలో కొద్దిగా పెరుగు, కలబంద గుజ్జు, నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. గంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే... ముఖంపై మెుటిమలు, నల్లటి మచ్చలు రావు. 
 
4. ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. అందువలన ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనె లేదా నెయ్యి కలిపి మెుటిమలపై రాసి.. కాసేపు మర్దనా చేయాలి. 45 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మెుటిమలు రావు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాంగ్రెస్ సర్కారు కాదు.. సీరియల్ స్నాచర్ : కేటీఆర్

నా ఒంట్లో ఏం బాగోలేదన్న బాలికను టెస్ట్ చేయగా గర్భవతి

మైనర్ అమ్మాయిని చిన్న పిల్లవాడిని ముద్దు పెట్టుకునేలా చేశాడు.. యూట్యూబర్‌పై కేసు

జనవరి 9 నుంచి వైజాగ్‌లో లైట్ హౌస్‌ ఫెస్టివల్

Pithapuram: సంక్రాంతికి సిద్ధం అవుతున్న పిఠాపురం.. పవన్ రాకతో సినీ గ్లామర్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajasab loss: తెలంగాణాలో రాజా సాబ్ ప్రివ్యూలను అడ్డుకున్నదెవరు? నష్టపోయిన నిర్మాత

Niharika Konidela: నిహారిక కొణిదెల‌ నిర్మిస్తోన్న‌ చిత్రం రాకాస

Raja Saab review : ద రాజాసాబ్ తో ప్రభాస్ అలరించాడా! లేదా! - ద రాజాసాబ్ రివ్యూ రిపోర్ట్

Oscars 2025: ఎలిజిబుల్ ఫిల్మ్స్ బెస్ట్ పిక్చర్స్ రేసులో కాంతార చాప్టర్ 1

Samantha : మా ఇంటి బంగారంలో సమంత.. అంతా రాజ్ నిడిమోరు చేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments