Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో మహిళలే బెస్ట్.. వారితోనే లాభాల పంట!

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2015 (12:11 IST)
మహిళా నాయకత్వంలోనే లాభాల పంట సాధ్యమవుతుందని క్రెడిట్ స్విస్ నివేదిక వెల్లడించింది. కంపెనీల నిర్వహణలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తే లాభాల పంట పండిస్తారని.. పోటీ కంపెనీలతో తమ కంపెనీని లాభాల్లో ముందుకు తీసుకొస్తారని క్రెడిట్ స్విస్ అధ్యయన నివేదిక చెబుతోంది. 
 
కంపెనీలకు చెందిన బోర్డుల్లో మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా వాటాదారులకు ఎక్కువ డివిడెండ్లు ఇవ్వడానికి, అధిక రాబడులను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని క్రెడిట్ స్విస్ అనే సంస్థ పేర్కొంది. మహిళలు ఆర్థిక విషయాల్లో పాత సంప్రదాయ ధోరణులనే అనుసరిస్తారన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవని, నూతన ఒరవడితో మహిళలు ముందడుగు వేస్తున్నారని పేర్కొంది. 
 
3వేల కంపెనీల్లోని 28వేల మంది సీనియర్ మేనేజర్ల అభిప్రాయాలను తీసుకుని క్రెడిట్ స్విస్ ఈ నివేదికను రూపొందించింది. ఈ కంపెనీల్లో భారత్‌లోని కంపెనీలు కూడా ఉన్నాయి. కొత్తగా ఆవిర్భవిస్తున్న కంపెనీల్లో మహిళల ప్రాతినిధ్యం బాగానే పెరుగుతోందని ఆ నివేదిక తెలిపింది.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

Show comments