Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మిస్ ఇండియా.. స్వరూప్ రావల్‌కు ఆ అవార్డ్?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (14:40 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ యాక్టర్ పరేష్ రావత్ సతీమణి, నటీమణి, టీవీ ఆర్టిస్ట్‌ స్వరూప్ రావల్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆమె ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈమె ప్రపంచంలోనే అత్యుత్తమ ఉపాధ్యాయుల జాబితాలో స్థానం సంపాదించుకుంది. 
 
బ్రిటన్‌కు చెందిన వర్కీ ఫౌండేషన్‌ ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత సేవలు అందించే ఉపాధ్యాయులను అవార్డుల కోసం ఎంపిక చేస్తుంది. ఇంకా వారికి అవార్డులను కూడా ప్రదానం చేస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది అత్యుత్తమ ఉపాధ్యాయుల పురస్కారానికి 179 దేశాల నుంచి దాదాపు 10వేల మందిని సిఫార్సు చేశారు. ప్రస్తుతం వీరిలో పది మందిని వర్కీ ఫౌండేషన్ ఎంపిక చేసింది. ఈ టాప్-10 జాబితాలో భారత్‌కు చెందిన ఉపాధ్యాయురాలు స్వరూప్ రావల్ స్థానం దక్కించుకున్నారు. 
 
ఈ అవార్డుతో పాటు ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని కూడా ఆమెకు అందజేసింది. స్వరూప్ రావల్ 1979వ సంవత్సరం మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంకా నటీమణిగా పలు హిందీ సినిమాలు, సీరియల్స్, ప్రకటనల్లో నటించారు. ఇక స్వరూప్ రావల్.. బీజేపీ ఎంపీ పరేష్ రావల్ సతీమణి కావడం గమనార్హం. 
 
పెళ్లికి తర్వాత సినిమాల్లో నటించడాన్ని తగ్గించుకున్న ఆమె.. ఉపాధ్యాయురాలిగా అవతారం ఎత్తారు. పీహెచ్‌డీ ముగించిన ఆమె.. దేశంలోని పలు దేశాలకు వెళ్లి విద్యకు సంబంధించిన సేవలను చేశారు. టీచర్‌గా రాణించారు. ఈ క్రమంలోనే గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2019 అవార్డుకు ఎంపికయ్యారు. వీరి ఉపాధ్యాయ, విద్యా సేవలకు గాను.. గుజరాత్  రాష్ట్రం విద్యా పథకాల అధికారిగా స్వరూప్ రావల్‌ను నియమించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డ్రైవర్స్ డే సందర్భంగా డ్రైవర్లను గౌరవించడానికి దేశవ్యాప్త కార్యక్రమం ప్రారంభించిన ASRTU

చికెన్ బిర్యానీలో సజీవంగా పురుగులు.. ఛీ.. ఛీ..? (Video)

ఏటికొప్పాక చెక్క బొమ్మలు- ఏపీ శకటానికి మూడవ స్థానం.. పవన్ థ్యాంక్స్

రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు.. కానీ ఆర్జీవీ ఏమన్నారంటే?

మీర్ పేట మాధవి హత్య కేసు: నాకు బెయిల్ వద్దు, లాయర్లు వద్దు అని న్యాయమూర్తి ఎదుట గురుమూర్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

ఇంట్లోనే పురుషులుంటే.. వీధుల్లోకి మహిళలు వెళ్తే పరిస్థితి ఏంటి? చిన్మయి

తర్వాతి కథనం
Show comments