Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఐపి భర్త మృతితో విఐపి అయిన మహిళ

Gulzar Ghouse
శనివారం, 27 ఫిబ్రవరి 2010 (16:53 IST)
FILE
ప్రస్తుతం మన దేశంలో విఐపి భర్తలను పోగొట్టుకున్నాక మళ్ళీ ఆ మహిళలు తమ గృహస్తు జీవితంతోపాటు భర్తల సామ్రాజ్యాన్ని కూడా వీరే పరిపాలిస్తున్నారు. మన భారతదేశంలో ఇలాంటి స్త్రీలకు కొదవే లేదు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, రాజేష్ పైలెట్ శ్రీమతి రమా పైలెట్, గుజరాత్‌కు చెందిన దివంగత నాయకుడు చిమన్ భాయ్ పటేల్ శ్రీమతి ఊర్మిళా బేన్ పటేల్ తదితరులున్నారు.

సోనియా గాంధీ : ఈమె భర్త మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జీవించివున్నప్పుడు సోనియా సాధారణ గృహిణిగానే ఉండేవారు. ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంక గాంధీల ఆలనా పాలన చూస్తుండేది. ప్రజలకు ఆమె రాజీవ్ భార్యగానే తెలుసు. ఇందిరా గాంధీ బ్రతికి వున్నంత వరకు ఈమె ఆ ఇంటి కోడలుగానే ఉండేది. అలాంటిది ఆమె భర్త రాజీవ్ గాంధీ 1991 మే 21న హఠాన్మరణం చెందడంతో ఆమె రాజకీయ తెరపైకి వచ్చారు.

జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ప్రజలు వెంటనే పార్టీ బాధ్యతలు తీసుకొని ప్రధాని పదవి చేపట్టాలని ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తీసుకు వచ్చారు. కాని దీనిని ఆమె సున్నితంగానే తిరస్కరించారు. ఇలా ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత 1998లో సోనియా గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె వెంటనే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు.

ప్రస్తుతం సోనియా గాంధీ దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా ఎదిగారు. కాని 10 జన్‌‍‌పథ్‌లో నివసించే వారి మాటలేంటంటే... ఆమె రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు తగినంత సమయం కేటాయిస్తుంటారు. ప్రియాంక పిల్లలిద్దరు అమ్మమ్మ (సోనియా) ఒడిలో పెరిగి పెద్దైనవారే.

కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి యువనేత రాజేష్ పైలెట్ కారు దుర్ఘటనలో మృతి చెందడంతో అతని సతీమణి రమా పైలెట్ అతని రాజకీయ కార్యకలాపాలను అందిపుచ్చుకుంది. లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి గెలిచింది. ఆమె రాజస్థాన్‌లో ఎమ్మెల్యేగాను ఉన్నారు. కాని ఆమె తన కుమారుడు ప్రత్యక్ష రాజకీయాలలోకి రానంత వరకు మాత్రమే ఆమె రాజకీయాలలోవున్నారు. ఆ తర్వాత సచిన్ పైలెట్ తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు.
FILE


అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ భర్త వినోద్ దీక్షిత్ ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నారు. కాని ఆమె మామగారు అంటే వినోద్ దీక్షిత్ తండ్రి ఉమాశంకర్ దీక్షిత్ కేంద్ర మంత్రిగా చాలా కాలం పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పేరుగాంచిన ప్రముఖ నాయకునిగా వెలిగారు. అధికారి అయిన తన భర్తతోపాటు షీలా దీక్షిత్ కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తించడంతోపాటు మామకు సంబంధించిన రాజకీయాలలోను ఆమె తన సహకారాన్ని అందించేవారు. కాని భర్త మృతి చెందిన తర్వాత షీలా దీక్షిత్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చారు. మామగారి వారసత్వాన్ని ఆమె పుణికి పుచ్చుకుని ఎంపిగా ఎన్నికయ్యారు.

కేంద్రప్రభుత్వంలో ఆమె మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఢిల్లీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలలో నిత్యం సతమతమౌతున్నా కూడా ఆమె తన వంటగదిలో ఏమేం వంటలు చేయాలో వెనువెంటనే చేసేసి మళ్ళీ తన రాజకీయ కార్యకలాపాలలో మునిగిపోతుంటారు. పిల్లలు పెద్దవారైపోయారు. ప్రస్తుతం వారి పిల్లలతో ఆమె కొంత సమయాన్ని వారికోసం కేటాయిస్తుంటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments