Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ చేతులు...పూలకన్నా మృదువైనవి

Gulzar Ghouse
అందమైన, అతి కోమలమైన చేతులంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. ముఖ్యంగా మహిళ్ళల్లో అయితే మరీనూ...అందునా వారితో మాట్లాడేటప్పుడు ముందుగా వారి ముఖం చూసి ఆ తర్వాత వారి చేతులను పరిశీలిస్తుంటారు చాలామంది.

అందమైన మీ చేతులను మరింత అందంగా తీర్చిదిద్దుకోండిలా...

** తొలుత మీరు మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి. ఏదైనా సాఫ్ట్ లోషన్‌తో మీ రెండు చేతులను బాగా కడుక్కోండి. మీ చేతుల్లో ఎక్కడైనా మరకలుంటే, అక్క డ నిమ్మకాయ రసంతో రుద్దండి. అక్కడున్న మరకలు మటుమాయం. ఇలాంటి మరకలను మాయం చేయడానికి నిమ్మకాయ ఎంతో ఉపయోగపడుతుంది.

** మీ చేతులను కడిగిన తర్వాత మంచి మాయిశ్చరైజర్ లేదా క్రీమును చేతులకు అప్లై చేయండి. దీంతో మీ చేతులు మృదువుగా ఉంటాయి.

** ఒక వేళ మీరు నీళ్ళల్లో ఎక్కువ సేపు పని చేసే వారైతే మీ చేతులకు గ్లౌజులు వాడండి. అలాగే మీరు వెంట్రుకలకు గోరింటాకు పెట్టేటప్పుడు కూడా చేతులకు గ్లౌజులు పెట్టుకోండి.

** మీరు తోటల్లో పని చేసే ముందు సబ్బు ముక్కలను మీ గోళ్ళల్లో నింపుకొని గ్లౌజులు ధరించండి.

చేతులకు మాలిష్ చేయండిలా...

** రాత్రి పడుకునే ముందు చేతులకు క్రీమును బాగా మాలిష్ చేయండి. చేతులకు వ్యాయామం చేయండి. 6-7 సార్లు పిడికిళ్ళను బిగించి తెరవండి. దీంతో రక్త ప్రసరణ బాగా జరిగి చేతులు మృదువుగా మారుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

** మీ అరచేతులను బాగా చాచి వేళ్ళను చక్కగా ఉంచండి. దీనినికూడా 6-7సార్లు చేయండి.

** ఒక్కొక్క వేలిని చక్కగా నిలబెట్టి సుతిమెత్తగా అదమండి. ఆ తర్వాత మీ అరచేతిని కాసేపు వ్రేలాడదీయండి. మీరు బయట ఎండలో వెళ్ళేటప్పుడు కేవలం ముఖానికి మాత్రమే కాకుండా చేతులకు కూడా సన్ స్క్రీన్ వాడమని వైద్యులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

Show comments