Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబారా ఖర్చులను అదుపు చేయడంలో మహిళలే...

Webdunia
సోమవారం, 22 మార్చి 2010 (14:50 IST)
FILE
అలంకరణలో అందంగా తయారయ్యేందుకు, విలువైన నగలు, చీరలు ధరించడంలో మహిళలు ఎల్లప్పుడూ ముందుంటారు. అలాంటిది ఇంటి ఖర్చులలో దుబారా ఖర్చులను అదుపు చేసే విషయానికి వస్తే పురుషులకన్నా మహిళలే ముందుండటం గమనార్హం. ఇంటి ఖర్చులను అదుపు చేయడంలో మహిళలు ముందుంటారని ఓ సర్వేలే తేలింది.

ఇంటి బడ్జెట్‌ను మహిళలు చాలా చక్కగా రూపొందించుకుంటారని, ఇంటికి కావలసిన సరుకులు, ఇతర వస్తువులను కొనుగోలు చేయడంతోపాటు పనికిమాలిన ఖర్చులను అదుపు చేయడంలో మహిళలు చక్కటి పాత్రను పోషిస్తారని బ్రిటన్‌కు చెందిన ఇడీ బోషర్ ఆఫ్ లవ్లీ మనీ డాట్ కాం తెలిపింది.

పనికిమాలిన ఖర్చులకు పురుషులే ఎక్కువగా డబ్బును దుబారా చేస్తుంటారని, కాని మహిళలు మాత్రం దుబారా ఖర్చులను చాలావరకు తగ్గించుకుంటున్నట్లు తమ సర్వేలో తేలినట్లు ఇడీ బోషర్ ఆఫ్ లవ్లీ మనీ డాట్ కాం నిర్వాహకులు తెలిపారు. చాలా వరకు భర్తలు తమ జీతాలను భార్యామణులకు అందజేస్తే అందులోంచి కుటుంబానికి అవసరమయ్యే ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును మహిళలు దాచిపెట్టి అవసరానికి వినియోగిస్తుంటారని ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు.

పెట్టుబడులు, పొదుపుపై పురుషులు అంతగా పట్టించుకోరు, కాని మహిళలు మాత్రం తమవద్దనున్న డబ్బును చాలా పొదుపుగా వాడుతుంటారు. మహిళలు చాలా ఎక్కువ ఖర్చు చేస్తుంటారని, అత్యంత విలువైన ఆభరణాలు, వస్త్రాలు, జోళ్ళు, అలంకరణ సామగ్రిని కొనుగోలు చేయడంలో డబ్బును నీళ్ళలా ఖర్చు చేస్తుంటారని పురుషులు అపోహపడుతుంటారు. కాని ఇది ఏ మాత్రం వాస్తవం కాదని తమ సర్వేలో తేలినట్లు ఆ సంస్థ వివరించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

పాకిస్థాన్‌కు గూఢచర్యం - జమ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

Show comments