Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ్‌భాయ్ సివిల్స్ టాపర్

Webdunia
శనివారం, 4 మే 2013 (14:15 IST)
WD
పట్టుదల, దృఢచిత్తం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని గుజరాత్ రాష్ట్రానికి చెందిన కోమల్ అనే మహిళ నిరూపించింది. పెళ్లయిన 15 రోజులకే కట్నం చాల్లేదని తన భర్త, ఆడబిడ్డలు ఇంట్లో నుంచి ఆమెను గెంటివేశారు. అదనపు కట్నం ఇచ్చుకోలేని కడుపేదరికం వల్ల ఆమెను అత్తారింటివాళ్లు గెంటివేశారు. ఐనా తన జీవితం ఇక ఎడారిగా మారిపోతుందని దిగులు చెందక జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఏకైక లక్ష్యంతో కోమల్ సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అయింది. ఆమె కన్న కల శుక్రవారంనాడు సాకారమైంది. యూనియన్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఏకంగా ఆమె 591 ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని ఓ మారుమూల పల్లెటూరులో ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలినిగా పనిచేస్తున్న కోమల్ త్వరలో ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్‌లో చేరబోతోంది. అదనపు కట్నం ఇవ్వలేని కారణంగా భర్తతో గెంటివేయబడ్డ కోమల్ స్టోరీ తెలుసుకుందాం.

కోమల్ అందానికి అందం ఉన్న అమ్మాయే. అలాగే అందరి అమ్మాయిల్లాగే కోమల్ కూడా తనకు కాబోయేవాడి గురించి కలలు కన్నది. తన తండ్రి రిటైర్డ్ టీచర్. ఐతే కూతురుకు గొప్పింటి సంబంధం చేయాలని, ఆమెను సుఖసంతోషాలతో చూడాలని న్యూజీలాండ్ లో పనిచేస్తున్న ఓ ఎన్నారైకిచ్చి పెళ్లి చేశాడు. అయితే 15 రోజులు కూడా తిరక్కుండా కూతురు జీవితం వీధిన పడేశాడు సదరు ఎన్నారై భర్త.

కోమల్ ఆడబిడ్డలు సైతం తోటి స్త్రీ అనే కనికరం లేకుండా గెంటివేశారు. దీంతో కోమల్ పుట్టింటికి తిరిగి వచ్చేసింది. తనకు న్యాయం కావాలంటూ ఆమె చేసిన ప్రయత్నాలను ఆమె పేదరికమే వెక్కిరించింది. ఆ స్థితిని చూసుకుని కుంగిపోకుండా పాఠశాలలో టీచర్‌గా చేరి తన లక్ష్యం ఏమిటో నిర్దేశించుకున్నది. ఆ దృఢ సంకల్పమే ఆమెను సివిల్స్‌లో టాపర్‌గా నిలిపింది.

తన పట్ల అమానుషంగా ప్రవర్తించిన భర్త, ఆడబిడ్డల పనిపడతానని ఇప్పుడు అంటోంది. న్యూజీలాండ్‌లో ఉంటున్న భర్త, ఆడబిడ్డలు వివరాలు తనకు తెలిసే అవకాశం లేకుండా వారు జాగ్రత్తపడ్డారనీ, అయినా వారిని వదిలిపెట్టే ప్రశ్నే లేదని కోమల్ చెపుతోంది. తన జీవితాన్ని ఎడారిమయం చేసినవారికి బుద్ధి చెపుతాననీ, తన జీవితంలా మరో స్త్రీ జీవితం కాకుండా చేయాలన్నదే తన తాపత్రయం అని అంటోంది కోమల్. అవును... కోమల్ పట్టుదల, జీవితంపై ఉన్న నిబద్ధత, దృఢచిత్తం ఆదర్శనీయం కదా.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Show comments