Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆడ బాస్" కంటే "మగ బాస్" ఎంతో నయం: మహిళా ఉద్యోగులు

Webdunia
" ఆడ బాస్ దగ్గర పనిచేయాలా...? అమ్మబాబోయ్.. కుదరదంటే కుదరదు. ఆ బాస్‌కో దణ్ణం ఆ ఉద్యోగానికో దణ్ణం.." అంటున్నారట లండన్‌లోని మహిళా ఉద్యోగులు. మగ బాస్‌ల మూడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు, కానీ ఆడ బాస్‌ల వ్యవహారం ఓ పట్టాన అంతుపట్టదనీ, ఏ క్షణంలో ఏం మాట్లాడతారో... ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియక అనునిత్యం టెన్షన్‌తో ఉక్కిరి బిక్కిరి అవుతామని చెపుతున్నారు.

" ఆడ్ బాస్/మగ బాస్... ఎవరి వద్ద పనిచేయడం బావుంటుంద"న్న అంశంపై ఇంగ్లండుకు చెందిన ఓ బృందం సర్వే చేపట్టింది. ఈ సర్వేలో సుమారు 2 వేల మంది పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. వీరిలో 63 శాతం మంది 'మగ బాస్'లకే ఓటు వేశారు.

' ఆడ బాస్'లకు కేవలం 37 శాతం మంది మాత్రం ఓకే చెప్పారు. 'ఆడ బాస్'లు ఎందుకు నచ్చటం లేదో చెప్పమని అడిగినప్పుడు వారిలా చెప్పుకొచ్చారు. మగబాస్ ఏ సమస్యనైనా అప్పటికప్పుడే తేల్చేస్తారనీ, ముక్కుసూటిగా మాట్లాడతారనీ, ముఖ్యంగా ఆడవారి సమస్యలపట్ల మగ బాస్‌లు సానుకూల వైఖరిని కనబరుస్తారని చెప్పారు. అదే ఆడ బాస్‌లైతే... తాము ఏ సమస్య చెప్పినా అడ్డగోలు ప్రశ్నలు వేసి ఓ పట్టాన సమస్యకు పరిష్కారం చూపరని చెప్పారు.

సర్వేలో తేలిన మరో విశేషమేమిటంటే... ఆడ బాస్‌లు ఉద్యోగస్తుల వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడంలో దిట్ట అని తేలింది. ఇక మగ బాస్‌లు కార్యాలయంలోని అన్ని పనులతోపాటు ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యల పట్ల సత్వరమే స్పందించే గుణాన్ని కలిగి ఉంటారని తేలింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్