వక్షోజాల ఆకృతిపై ఆడవారి ఆందోళన!

PNR
సాధారణంగా ఆడవారికి పాలిండ్ల (వక్షోజాలు) ఆకృతిలో తేడాలు కనిపిస్తుంటాయి. దీంతో వారు ఆందోళన చెందుతుంటారు. కొంతమంది మహిళల్లో ఇవి అరుదుగా కనిపిస్తున్నాయి. రెండు పాలిండ్లలో పరిమాణంలో స్వల్ప తేడాలు ఉంటాయి. దీంతో గాబరా పడే ఆడవారు.. ప్లాస్టిక్ సర్జరీకి వైపు మొగ్గు చూపుతారు. సైజుల్లో తేడాలు ఉన్న ప్రతి ఒక్కరు సర్జరీని చేయించుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

ఎందుకంటే ఇది అధిక ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల పేద, మధ్య తరగతి యువతులకు ఇది అందని ద్రాక్షలాంటింది. కానీ.. ప్లాస్టిక్ సర్జరీకి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నో ఉన్నాయంటున్నారు వైద్యులు. ఉదాహరణకు ఒక మహిళ తన వక్షోజాల పరిమాణంలో తేడాలు ఉన్నాయని గుర్తించిన పక్షంలో ఈ లోపాన్ని తాను ధరించే దస్తులు ద్వారానే భర్తీ సరి చేసుకోవచ్చు.

తాను ధరించే జాకెట్‌ లోపలి భాగంలో మన ఆకారానికి తగినట్లుగా ప్యాడ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటితో సర్దుకోవచ్చు. చిన్నగా ఉండటానికి, పెద్దవిగా అవడానికి కూడా శరీరాకృతులు మార్చుకునే రీతిలో కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేయవచ్చు. సాధారణంగా వక్షోజాల పరిమాణాన్ని పెంచుకునే పద్ధతిని మామోప్లాస్టీ ప్లాస్టిక్‌ సర్జరీ అంటారు.

తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే చేయించుకోవడం ఉత్తమం. నిపుల్స్ (చనుమొనలు) విషయంలో కూడా చాలా మంది ఆడవారికి భయాందోళనలు ఉంటాయి. సెక్స్ స్పందనలు లేనప్పుడు అవి లోపలికి కుంచించుకు పోతాయి. ఎపుడైతే తమలో కామవాంఛలు ఏర్పడతాయే.. ముందుకు పొడుచుకువస్తాయి. చాలా మంది ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటారు.

తమకు బ్రెస్ట్ క్యాన్సర్‌ సోకడం వల్లే చనుమొనలు లోపలికి ముడుచుకు పోయాయని భావిస్తారు. నిజానికి ఇదంతా అపోహ మాత్రమే. అయితే బ్రెస్ట్ క్యాన్సర్‌ లక్షణాలు వేరే విధంగా ఉంటాయి. చేతితో తడిమి చూసుకున్నప్పుడు గడ్డలుగా తగులుతుంటాయి. హార్మోన్లలో మార్పులు కూడా వక్షోజాల పరిమాణాన్ని నిర్ధేశిస్తుంటాయి. వీటన్నింటిని గమనిస్తూ ఉండాలి. అవసరమైతే లేడీ డాక్టర్‌ను సంప్రదించి తగిన వైద్య చికిత్స తీసుకోవాల్సి వుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీజీఎస్సార్టీసీ: ఏప్రిల్ 22 నుండి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపు

మరోసారి పిఠాపురంలో భగ్గుమన్న విభేదాలు- ఫ్లెక్సీల వివాదం.. దొరబాబు వర్సెస్ వర్మ (video)

గొరిల్లాల ఎంక్లోజర్‌లో పొరబాటున జారిపడిన బాలుడు, ఆ గొరిల్లా ఏం చేసిందంటే? వీడియో

పాకిస్థాన్‌కు చెంపదెబ్బ, పహల్గామ్ మారణకాండ తర్వాత పర్యాటకుల భారీ పునరాగమనం

తిరుమలలో యువతి అదృశ్యం.. గదిలోంచి బయటికి వెళ్లి.. తిరిగి రాలేదు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు

Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !

Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్

బెల్లంకొండ గణేష్, ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం

Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్‌