Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణులకు చేతినిండా గాజులతో ఎందుకు అలంకరిస్తారో తెలుసా?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (16:09 IST)
గాజులు మనకు అలంకరణ వస్తువులుగా, ఆభరణాలుగా మాత్రమే తెలుసు. రంగు రంగు గాజులను ధరించి అమ్మాయిల చేతులు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. చేతులకి గాజులందము... చెంపకు సిగ్గులందము అన్నాడో మహాకవి. కేవలం అందం కోసమే గాజులయొక్క ప్రయోజనం.. అని అనుకోవడం పొరపాటు. గాజులు...స్త్రీకి రక్షాకంకణం వంటిది. ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలున్నాయి.
 
ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా చిన్నతనం నుంచే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు. ఎందుకంటే జీవితం చాలా విలువైనది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. గాజులాగే పగిలిపోతుంది అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చెయ్యడం కోసమే. ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసే ఆచారాన్ని అలవాటు చేసారు.
 
అంతేకాదు గర్భాశయ నాడులను ఉద్దీపనం చేయడానికి ఉద్దేశించినవే గాజులు. మహిళలకు మణికట్టుకు ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటుంది. మణికట్టు నాడుల స్వల్పంగా ఒత్తిడికి లోనవుతుంటే, గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతుంటాయి. దాంతో గర్భాశయం పనితీరు, కండరాల కదలికలు సవ్యంగా జరుగుతుంటాయి. అందుకే గర్భిణులకు నిండుగా గాజులు వేసి అలంకరిస్తారు. గాజుల శబ్ధం గర్భస్థ శిశువు చెవులకు ఇంపుగా వినిపిస్తాయని.. తద్వారా శిశువుకు శబ్ధాన్ని గ్రహించే శక్తి పెంపొందుతుందని వైద్యులు అంటున్నారు. 

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments