ప్రసవం తర్వాత మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Webdunia
బుధవారం, 11 జూన్ 2014 (17:07 IST)
మహిళల్లో ప్రసవం తర్వాత శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాదు మెదడు మీద కూడా కొత్త ఒత్తిడికి దారితీస్తుంది. ప్రసవం తర్వాత బరువు, శక్తి కోల్పవడం మనస్సులో ఒక స్థిరమైన ఒత్తిడి పెరిగిపోతోంది. శరీరంలో మార్పులు తేవాలంటే తగినంత శక్తి, వ్యాయామం చాలా అవసరం. ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ కొన్ని నెలల పాటు లేదా ఒక సంవత్సరం వరకూ ఉండవచ్చు. 
 
ఈ పోస్ట్ నేటల్ డిప్రెషన్ తగ్గించుకోవడానికి కొంత కష్టం అవుతుంది. అందుకు కొంత విశ్రాంతి తీసుకోవడం మరియు రిలాక్స్‌గా ఉండటం చాలా అవసరం. పోస్ట్ నేటలర్ డిప్రెషన్ తగ్గించుకోవాలంటే మీరు హెల్తీ అండ్ న్యూట్రీషియన్ డైట్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే శిశువుకు పాలు పట్టే తల్లిలో అనేక హార్మోనుల మార్పులు జరుగుతాయి . కాబట్టి శరీరంను సమతుల్యం చేసే పోషకాహారన్ని తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మనస్సుతో ఉండవచ్చు.
 
ప్రసవం తర్వాత ఒత్తిడికి ప్రధాన కరాణం నిద్రలేమి కూడా ఒకటి. కాబట్టి, ప్రసవం తర్వాత తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి, శిశువు నిద్రించేటప్పుడు తల్లికూడా నిద్రపోయి, తగిన విశ్రాంతి తీసుకోవాలి. మీ మనస్సును ప్రశాంత పరచుకోవడానికి ఉపాయం వెతకండి. మీకు అత్యంత ఇష్టమైన పనులను చేయడానికి ప్రయత్నించండి. ఇది ఒక ప్రభావంతమైనదిగా పనిచేస్తుంది. ఎక్కువ సమయం మీ బేబీతో గడపడానికి ప్రయత్నించండి. దాంతో డిప్రెషన్ మరియు స్ట్రెస్‌ను తగ్గించుకోవడానికి సహాపడుతుంది. 
 
ప్రసవం తర్వాత మీ బరువును తగ్గించుకోదలచుకొన్నప్పుడు. మీరు యోగా క్లాస్సుల్లో చేరడం బెటర్. ఇది మీరు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. చాలా మంది మహిళలు ప్రసవం తర్వాత వారి మీద శ్రద్ధ ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి, వ్యక్తిగతంగా అందం, ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ తీసుకోవడం మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్

భర్తకున్న అక్రమ సంబంధం తెగిపోవాలి.. ఎల్లమ్మ ఆలయంలో భార్య పూజలు (video)

ఛీ.. ఛీ.. యాక్, ఈ బిస్కెట్లు ఎట్లా తింటున్నారు, నేలకేసి కొడుతున్న కోతులు, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

Varma: పదహారేళ్ళ తర్వాత రీ రిలీజ్ కాబోతున్న రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర

Show comments