మహిళల్లో అనారోగ్య సమస్యలు కలిగించే బెల్లీ ఫ్యాట్.. తగ్గించుకునే చిట్కాలేంటి?

Webdunia
మంగళవారం, 19 జనవరి 2016 (12:12 IST)
బెల్లీ ఫ్యాట్ శరీరానికి అసౌకర్యంగాను, అందవిహీనంగాను కనబడేలా చేస్తుంది. అంతేకాదు, వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే అందుకు కొన్ని వెయిట్‌లాస్ టిప్స్‌ను పాటించాలి. బరువు పెరగడం వేరు, పొట్ట మాత్రమే పెరగడం వేరు చాలా వరకూ స్త్రీ, పురుషుల ఇద్దరిలోనూ బెల్లీ ఫ్యాట్ అనేది సహజ సమస్య. దీనిని తగ్గించుకోవడం ఎంతోమంచిది. 
 

బెల్లీ ఫ్యాట్ ముఖ్యంగా మహిళల్లో పెను సమస్యగా మారింది. బెల్లీ ఫ్యాట్ వల్ల మహిళల్లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పీరియడ్స్ సమస్యలు, హార్మోనుల అసమతుల్యతలు, హైబీపి, షుగర్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా జరుగకుండా ఉండాలంటే బెల్లీ ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి. అందుకు సరైన ఆహారంను, సరైన టైమ్‌కు తీసుకోవాలి. పొట్టచుట్టూ చేరిన అదనపు కొవ్వు కరిగించుకోవడానికి డైట్‌కు సహాయపడే ఆహారంతో పాటు, కొన్ని వ్యాయామాలు కూడా చేయడం ద్వారా టమ్మీ ఫ్యాట్‌ను కరిగించుకోవచ్చు. 
 
ముఖ్యంగా ప్రతి రోజూ నిద్ర లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులతో దినచర్యలు మొదలవుతాయి. వ్యాయామం చేసే సమయం ఉండదు. ఒక వేళ చేయాలనుకున్నా దాన్ని కాస్త సాయంత్రానికి వాయిదా వేస్తారు. క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయడం ద్వారా ఫ్లాట్ స్టమక్‌ను పొందవచ్చు. బరువు తగ్గించుకోవడానికి సరైన వెయిట్ లాస్ టిప్స్‌తో బెల్లీ ఫ్యాట్‌‌ను త్వరగా కరిగించుకోవచ్చు. బెల్లీ ఫ్యాట్ కరిగించేందుకు ఈ డైట్‌ని అనుసరించండి.
 
రోజూ ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి. ఇది ఎనర్జీ లెవల్స్ పెంచడానికి సహాయపడుతుంది, ఇంకా మిమ్మల్ని హైడ్రేషన్‌లో ఉంచడమే కాదు, ఫిట్‌గా ఉంచుతుంది. బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి 30 నిముషాలు ట్రెడ్ మీల్‌పై నడిస్తే ఎంతో మేలు. వర్క్ చేసేప్పుడు, శ్వాసలోపలికి తీసుకోవడం, బయటకు వదలడం ద్వారా బెల్లీఫ్యాట్ కరిగించుకోవచ్చు.
 
అలాగే, తక్కువ క్యాలరీ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. తగినంత నీరు త్రాగడం మాత్రం మర్చిపోవద్దు, నీరు ఎంత త్రాగితే అంత మంచిది. అప్పుడే మిమ్మల్నియాక్టివ్‌గా ఉంచుతుంది. లోక్యాలరీ ఫుడ్ తీసుకోవడం ఒక మంచి ఉపాయం.
 
ప్రతిరోజూ రాత్రి పడుకోవడానికి ముందుగా నేచురల్ జ్యూస్ తాగితే 15 రోజుల్లోనే పొట్ట క్రమంగా తగ్గిపోతుంది. తాజా జ్యూస్ మీ టమ్మీని ఫిల్ చేయడానికి సహాయపడుతుంది అంతేకాక ఆకలిని చాలా మేరకు నివారిస్తుంది. 
 
గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మీకు అవసరమయ్యే ఎనర్జీని అందిస్తుంది. ఒక స్పూన్ నిమ్మకాయరసం, ఒకటేబుల్ స్పూన్ అల్లం తురుము, కొంచెం దోసకాయ జ్యూస్ తీసుకుని బాగా మిక్స్ చేయాలి. రాత్రి నిద్రపోవడానికి ఈ జ్యూస్ తాగితే 10 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.
 
బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకోవాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. ఇది మలబద్దకానికి గురిచేయదు. ఫ్రూట్స్‌ని పరిపూర్ణంగా తీసుకోవాలి. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి తోడ్పడుతుంది.
 
కోడిగుడ్డులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఎవరైతే త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటున్నారో వారికి ఇది గొప్పగా సహాయపడుతుంది. ఇది తక్షణ ఎనర్జీ లెవల్స్‌ను అందిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా పాటిస్తే కొన్ని రోజుల్లోనే బరువు చాలా మేరకు తగ్గి... ఎంతో తేలికైన అనుభూతిని పొందుతారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నెతన్యాహు లైవ్ వీడియో, హుషారుగా కాఫీ తాగుతూ ఇజ్రాయెల్ ప్రధాని

ఇరాన్‌పై సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు : డోనాల్డ్ ట్రంప్

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా : తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక - నేడు అమరజీవి విగ్రహావిష్కరణ

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక- Statue of Sacrifice విగ్రహావిష్కరణ ఆహ్వానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

Ustaad Bhagat Singh: ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి కలగలిపిన ట్రైలర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆకట్టుకున్నాడు

మేడ్ ఇన్ కొరియా చిత్రీకరణ ఆనందించదగ్గ అనుభవం : ప్రియాంక మోహన్.

S.P. Charan: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

Rashmika: విజయ్ దేవరకొండ కోసం పోరాటం చేసిన రష్మిక మందన్న వీడియో రీరిలీజ్

Show comments