Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలా మజాకా.. కరోనాను ఎదుర్కొనే శక్తి పురుషుల కంటే...?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:37 IST)
మహిళలా మజాకా.. కరోనాను ఎదుర్కొనే శక్తి పురుషుల కంటే.. మహిళల్లోనే ఎక్కువగా వుంటుందని తాజా పరిశోధనలో తేలింది. ఇందుకు కారణంగా మహిళల్లో వుండే ''టి'' కణాలే. టి కణాన్ని టి లింఫోసైట్ అని కూడా అంటారు. ఇవి ఒకరకమైన తెల్లరక్తకణాలు. ఇవే రోగనిరోధక శక్తిని నిర్ణయిస్తాయి. 
 
మహిళల్లో ఉండే 'టి' కణాలు బలంగా ఉండటం వల్లే... పురుషులకంటే సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 'నేచర్' పత్రికలో ఈ వివరాలను ప్రచురించారు. అమెరికాలోని యేల్ న్యూ హెవెన్ ఆసుపత్రిలో పద్ధెనిమిదేళ్ళ వయస్సు పైబడిన 86 మంది కరోనా రోగులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
 
టి కణాలు బలంగా ఉన్న వ్యక్తిలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పురుషులతో పోల్చుకుంటే... ఈ టి సెల్స్ మహిళల్లోనే శక్తివంతంగా ఉంటాయని, తద్వారా కరోనాను ఎదుర్కొనే శక్తి మహిళల్లో అధికంగా వుంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. 
 
కోవిడ్ 19 తీవ్రత మగవారిలోనే ఎక్కువగా ఉంటోందని ఇంతకుముందు కూడా పరిశోధనలు వెల్లడించినా అందుకు గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. ఇప్పుడు మాత్రం స్పష్టత వచ్చింది. టీ కణాలు రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషిస్తాయని.. ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాలను చంపటంలో ఇవి మెరుగ్గా పనిచేస్తాయని వెల్లడి అయ్యింది.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments