జాబ్ ఎలాంటిదైనా.. ఆఫీసు వాతావరణంలో ఇమిడిపోవాలి

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (09:43 IST)
ఆఫీసు వాతావరణంలో త్వరగా ఇమిడిపోయే తత్వం ఉద్యోగికి ఉండాలి. కొత్త విషయాన్ని నేర్చుకునే తత్వంతో పాటు ఆఫీసులో ఇతరులతో చక్కగా మెలిగే స్వభావం ఉండాలి. తోటివారికంటే వేగంగా పని చేస్తూనే.. కచ్చితత్వం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ కెరీర్‌ గ్రాఫ్‌ సజావుగా సాగుతుంది.
 
ఉద్యోగి తనకిచ్చిన లక్ష్యాలను అందుకోవాలంటే అందరిలోకంటే డిఫరెంట్‌గా ఆలోచించే నైపుణ్యం ఉండాలి. సంస్థలో పని భారాన్ని ఎక్కువగా తీసుకున్నపుడు మంచి పేరు వస్తుంది. అనుకున్న లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. అప్పుడే సంస్థలో గుర్తింపు వస్తుంది. 
 
ఉద్యోగం సంపాదించాలంటే చాలా కాంపిటీషన్‌ను దాటుకుని రావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత కెరీర్‌ను ఎలా బిల్డప్‌ చేసుకోవాలి? త్వరగా సంస్థలో మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? అని ఆలోచించటం కాదు.. ఆచరణలో చూపించాలి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు ఈ విషయాలు తెలుసుకోవాలి. 
 
ఉద్యోగం తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలో.. ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికీ అంతే కష్టపడాలి. ప్రైవేట్‌ ఉద్యోగాల్లో ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే పోటీ ప్రపంచంలో మనుగడ సాధ్యం అవుతుంది. కొలువు కుదిరిన చోట మంచి మార్కులు రావాలంటే విషయ పరిజ్ఞానం తప్పనిసరి. నేర్చుకున్నదాన్ని ఉద్యోగంలో ఎలా అప్లై చేయాలనే విషయం తెలిసుండాలి. వీలైతే సీనియర్స్‌ సహాయంతో పనిలోని మెలకువలు తెలుసుకోవాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ కూడా అమెరికాకు ముప్పుగా మారుతుంది: అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డ్

Vijay: 50శాతం సీట్లు, 2.5ఏళ్ల సీఎం పోస్టు: నో చెప్పిన విజయ్.. త్రిషతో చర్చలు?

నేను ఆమెకు బినామీని కాదు.. సరస్వతి పవర్ షేర్లన్నీ షర్మిలకే చేరాలి.. విజయమ్మ

Kerala: కేరళలో విజృంభిస్తోన్న బర్డ్ ఫ్లూ.. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

ఇక కాస్కోండి... మా దెబ్బ రుచిచూపిస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ

రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?

న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

Show comments