Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల కోసం నీతా అందానీ కొత్త సోషల్ మీడియా

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (07:46 IST)
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఓ కానుక ఇచ్చింది. మహిళా సాధికారతే లక్ష్యంగా కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించారు. ‘హెర్‌ సర్కిల్‌’గా దానికి నామకరణం చేశారు. 
 
కేవలం మహిళలకు సంబంధిత విషయాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఫ్యాషన్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, బ్యూటీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన ఆర్టికల్స్‌ను చదవడంతో పాటు సంబంధిత వీడియోలనూ ఈ వేదిక ద్వారా వీక్షించొచ్చు. అవసరమైతే హెల్త్‌, వెల్‌నెస్‌, ఎడ్యుకేషన్‌కు, ఫైనాన్స్‌, లీడర్‌షిప్‌, మెంటార్‌ షిప్‌ వంటి విషయాల్లో రిలయన్స్‌ ప్యానెల్‌ నిపుణులు సమాధానాలు కూడా ఇస్తారు.
 
తన జీవితంలో ఎన్నో నేర్చుకున్నానని, వాటన్నింటినీ ఇతరులకు పంచుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించినట్లు నీతా అంబానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అలాగే మహిళలంతా ‘హెర్‌ సర్కిల్‌.ఇన్‌’లో చేరి ఇతరులతో తమ ఆలోచనలను పంచుకోవాలని సూచించారు. మహిళల కోసం ఒక సామాజిక మాధ్యమ వేదికను తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. 
 
ప్రతి మహిళా ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. హెర్‌ సర్కిల్‌.ఇన్‌ రిజిస్ట్రేషన్‌ ఉచితంగానే అందిస్తున్నారు. ప్రస్తుతం ఆంగ్లంలో అందుబాటులో ఉండగా.. క్రమంగా ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

తర్వాతి కథనం
Show comments