Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణ సమయంలో ఈ లగేజీ చిట్కాలను పాటించండి!

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2015 (19:21 IST)
విహారయాత్రలకు వెళ్లేందుకు లేదా లాంగ్ టూర్‌కు వెళ్లేటపుడు చాలామంది ఇబ్బడిముబ్బడిగా లగేజీని తమ వెంట తీసుకెళ్తుంటారు. ఇలాంటి చిన్నపాటి చిట్కాలను పాటించినట్టయితే లగేజీ బరువును వీలైనంత మేరకు తగ్గించుకోవచ్చు. అలాంటి చిట్కాలను ఏంటో ఓసారి పరిశీలిద్దాం. 
 
సాధారణంగా బ్యాగ్‌లో ఎంత బాగా సర్దినా బట్టలు ముడతలు పడటం సహజం. నీట్‌గా ఇస్త్రీ చేసుకుని తెచ్చుకున్న బట్టలు కాస్తా ముడతలు పడతాయి. అందువల్ల టూర్‌లకి వెళ్లేప్పుడు టీ షర్ట్‌లు, జీన్స్‌ వంటి దుస్తులను తీసుకెళ్లడానికి ప్రాధాన్యమివ్వాలి. 
 
అలాగే, ఎక్కువ బరువును మోయలేమని భావించేవారు.. వీల్స్ ఉన్న బ్యాగ్‌లను ఎంచుకోవడం మరీ మంచిది. రోలింగ్‌, బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్స్‌, షోల్డర్‌ బ్యాగ్స్ ఉంటే మరీ మంచిది. షోల్డర్‌ బ్యాగ్‌ను తగిలించుకుని మరో బ్యాగ్‌ను చేత్తో పట్టుకుని, రోలింగ్‌ బ్యాగ్‌ను మరో చేత్తో పట్టుకుంటే దాదాపుగా లగేజీ మొత్తం మీ చేతుల్లో ఉన్నట్లే. 
 
అలాగే, ప్రయాణ సమయంలో ఖాళీ ప్లాస్టిక్ బ్యాగ్‌లను వెంట తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే బట్టలపై సాస్‌, కర్రీలాంటి మరకలు పడితే వీటిని ఈ బ్యాగుల్లో పెట్టుకోవచ్చు. అలాగే, ఆయిల్స్, నూనెలు, ఊరగాయలు, జామ్ బాటిల్స్ వంటివి పొరపాటున కూడా బ్యాగుల్లో పెట్టుకోవద్దు. 
 
పొరపాటున అవి లీకైనా, పగిలినా బట్టలన్నీ పాడయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వస్తువులను ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో సర్దుకోవాలి. ఇలాంటి చిన్నపాటి టిప్స్ పాటించినట్టయితే మీ ప్రయాణం సుఖమయమయ్యేందుకు ఆస్కారం ఉంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments