Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిలిండర్ తీస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (15:26 IST)
సిలిండర్ ఇంటికొస్తే స్లిప్, డబ్బు ఇచ్చేయడం వరకే చేస్తున్నారా? ఏదీ గమనించకుండా సిలిండర్‌ను ఇంట్లో దించేసుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి. సిలిండర్ తీసుకునేటప్పుడు దాని బరువును ముందుగా గమనించాలి. 
 
* వెయిట్ చాలా తక్కువగా ఉంటే బరువెంత ఉందో చెక్ చేసి తీసుకోండి. 
* ఎక్స్‌పైరీ డేట్ చూసి సిలిండర్ దింపుకోండి. 
 
* ఎక్స్‌పైరీ డేట్‌కు సంబంధించిన వివరాలు సిలిండర్‌ను చేతిలో పట్టుకునే ప్లేస్‌లో ఉంటాయి. 
* ఇంగ్లీషులో ఎ, బి, సి, డి అనే అక్షరాలు లేదా రెండంకెల సంఖ్య ఉంటుంది. ఇవి నెలను సూచిస్తాయి. ఉదాహరణకు ఎ అనే అక్షరం వుంటే జనవరి నుంచి మార్చి వరకు (తొలి త్రైమాసికం) అనే అర్థం.  
* బి అనే అక్షరం వుంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సి అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, డి అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు త్రైమాసికాలను గుర్తిస్తుంది.
 
* సిలిండర్లో సి 14 అనే సంఖ్య ఉంటే 2014 సెప్టెంబర్ వరకు ఉపయోగించవచ్చునని అర్థం. 
* ఇక సిలిండర్ సీల్‌ను తప్పకుండా చెక్ చేయాలి. సిలిండర్ సీల్ ప్యాక్ అయ్యిందా లేదా అనేది చూసుకోవాలి. 
* రెగ్యులర్‌ను సరిచూసుకోవాలి. ఇందులో ఏదైనా సమస్య వుంటే గ్యాస్ లీకేజ్ అవుతుంది. 
* అందుచేత కొత్త సిలిండర్ వచ్చిన వెంటనే సప్లై చేసే వారిచే రెగ్యులేటర్‌కు ఫిక్స్ చేసుకోవడం మంచిది. 
* గ్యాస్ లీకేజ్ అయితే వెంటనే సప్లై చేసే వారి వద్దే రెగ్యులేటర్ ప్లస్ రబ్బర్ పైప్‌ను మార్చుకోవడం ఉత్తమం.

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments