డెలీవరీ తర్వాత పొట్ట తగ్గాలంటే... భోజనం తర్వాత నడవండి!

Webdunia
గురువారం, 4 డిశెంబరు 2014 (20:04 IST)
డెలీవరీ తర్వాత పొట్ట తగ్గాలంటే... భోజనం తర్వాత నడవండి! అంటున్నారు గైనకాలజిస్టులు. ప్రసవం తర్వాత పొట్ట తగ్గలేదంటే ఆఫ్టర్ లంచ్ నడక కొనసాగించాల్సిందే.  భోజనం చేసిన తర్వాత చాలా మంది కూర్చోవడమో లేదా పడుకోవడమో చేస్తుంటారు. 
 
మరి ప్రసవానంతరం కూడా ఇలాగే చేస్తే పొట్ట తగ్గడమేమో గానీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం తర్వాత దాదాపు పావుగంట అయినా అటూ ఇటూ నడవాలి. ఇది ఆరోగ్యానికి, పొట్టతగ్గడానికి రెండింటికీ మంచిది.
 
అలాగే కొంతమంది ఉదయం, సాయంత్రం...ఇలా రెండు పూటలకు సరిపడా వంట ఉదయమే చేసేస్తారు. కానీ అలా ఉదయం చేసిన పదార్థాలు సాయంత్రానికి చల్లగా అయిపోతాయి. వీటిని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. 
 
కాబట్టి ఏ పూటకు ఆ పూటే తాజాగా, వేడి వేడిగా వండుకొని తినడం వల్ల అటు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా... ఇటు పొట్ట ఎత్తు కూడా తగ్గుతుంది. అలా తాజా పండ్లు కూడా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతాయి.
 
ఇక కూరగాయల విషయంలో ఏ సీజన్‌లో దొరికే తాజా కూరగాయల్ని ఆ సీజన్‌లో తప్పనిసరిగా తినడం మంచిది. ఇలా చేస్తే పొట్ట తగ్గుతుంది. తినే ఆహారం మితంగా ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిదని, ఇంకా వ్యాయామం తప్పకుండా చేయాలని గైనకాలజిస్టులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కడప జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రావం - రిమ్స్‌ ఆస్పత్రికి తరలింపు

సుగాలి ప్రీతి హత్య కేసు దర్యాప్తును ఏపీ సర్కారు నిర్లక్ష్యం చేసింది.. జగన్ ఫైర్

బెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌కు చీమల బారుల్లా వెళ్లిపోతున్న బంగ్లాదేశీయులు, వీడియో

కన్నతల్లినే పక్కలోకి రమ్మన్న కామాంధ కొడుకు, పళ్లతో కొరికి, తలపై కొట్టి, వీడియో

SIRతో జాగ్రత్త, స్టాలిన్, మమతా బెనర్జీ అందుకే ఓడిపోయారు, మనం మరో రకంగా ఓడాము: జగన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

Show comments