జీతం వస్తుంది... కానీ చివర్లో చిల్లిగవ్వ ఉండదు... ప్లాన్‌ చేసుకుంటున్నారా?

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (18:45 IST)
ప్రియ నెలజీతం అందిన వెంటనే షాపింగ్‌ అంటూ పరిగెడుతుంది. అవసరం వున్నా లేకపోయినా ఏదో ఒకటి కొని ఇంట్లో తెచ్చి పడేస్తుంది. దాంతో నెలాఖరు వచ్చే సమయానికి అత్యవసర ఖర్చులు ఏమైనా వచ్చిపడితే డబ్బు చేతిలో ఉండక అప్పుచేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఈ విషయంలో ప్రియకు, భర్త రాజేష్‌తో నిత్యం గొడవలు జరుగుతూ వుండేవి. 
 
ఇటువంటి సంఘటనలు ఒక్క ప్రియ ఇంట్లోనే కాదు, చాలామంది ఇండ్లల్లో అప్పుడప్పుడూ జరుగుతూనే వుంటాయి. ప్రతి వ్యక్తికి నెలసరి ఖర్చు వుంటుంది. అదేవిధంగా నెలసరి ఆదాయం వుంటుంది. కాని వచ్చిన జీతాన్ని మనం ఎలా ప్లాన్‌ చేసి ఖర్చుపెడుతున్నామనే దానిపై పొదుపు చేయడం ఆధారపడి వుంటుంది. నెలజీతం అందుకోగానే రెచ్చిపోయి అప్పటికప్పుడు కనిపించినవన్నీ కొనేసి షాపింగ్‌ బ్యాగులు పట్టుకుని ఇంటికి చేరేవారికి నెల చివరిలో ప్రియ మాదిరిగా చిక్కులు తప్పవు. 
 
ఆదాయం, ఖర్చుకు సంబంధించిన అంచనా జీతం అందుకునేందుకు ముందే చేతిలో ఉండాలి. నెలవారి చెల్లించాల్సిన వాటిని కాగితం మీద రాసుకోవాలి. ఇంటి అద్దె, పచారీ సామాన్లు, పిల్లల స్కూల్‌ ఫీజులు, బస్‌ పాస్‌లు, పని మనిషి జీతం వంటివన్నీ ప్రతినెలా తప్పనిసరిగా ఉండేవే. కరెంట్‌, టెలిఫోన్‌ వంటి వాటిని కలుపుకుని ఇంకా అదనంగా కొంత డబ్బు జత కలిపి నెలకు తప్పకుండా అవసరమయ్యే ఖర్చు ఎంతో లెక్క తేల్చాలి. ఆ లెక్క ప్రకారం మీ జీతంలో నుండి డబ్బును తీసి ఒక కవర్‌లో విడిగా పెట్టి ఉంచండి.
 
అనుకోని ఖర్చులు కొన్ని వస్తుంటాయి. ఆరోగ్యం కోసం, దుస్తుల కోసం, బంధుమిత్రులు వచ్చినప్పుడయ్యే ఖర్చు వంటివన్నీ అదనపు ఖర్చులు. ఇలాంటి ఖర్చు నెలలో సరాసరిన ఎంతుంటుందో మీకు తెలిసే వుంటుంది. ఆ మేరకు డబ్బును తీసి మరో కవర్‌లో పెట్టండి. ఈ రెండు ఖర్చులూ పోగా మిగిలిన డబ్బును మూడో కవర్‌లో పెట్టి బీరువాలో భద్రంగా దాచండి. ఎంతో అవసరమైతే తప్పించి మూడో కవర్‌ తెరవనని మనసనులో శపథం చేసుకోండి. ఇటువంటి శపథం అమలుకు ఒకటిరెండు నెలలు శతవిధాలా ప్రయత్నిస్తే ఇక ఆ తర్వాత అదే అలవాటవుతుంది. ఇలా చేస్తే ప్రతి నెలా కొంత డబ్బు తప్పకుండా ఆదా అవుతుంది. 
 
కవర్లలో డబ్బు పెట్టి ఉంచడంతో పాటుగా దినవారి లెక్క తప్పదు. ప్రతిరాత్రి పడుకునే ముందు ఆ రోజు చేసిన ఖర్చును కాగితం మీద లేదా ఒక పుస్తకంలో రాసుకోవడం ద్వారా నెల చివరిలో ఖర్చు విషయం స్పష్టత ఏర్పడుతుంది. ఏ అంశం మీద ఎక్కువ ఖర్చు అవుతున్నది. ఎక్కడ దుబారా జరిగింది. ఏ అంశం మీద ఆదా చేయవచ్చు అనేది అంచనా వేసుకునేందుకు ఈ లెక్కలు పనికొస్తాయి. ఈ లెక్కలను బట్టి మరుసటి నెల బడ్జెట్‌లో మార్పులను చేసుకునేందుకు వీలుంటుంది. మరి మొదలుపెట్టండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)

తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జూన్ 26 వరకు భారీ వర్ష సూచన

మీకు గంట టైమిస్తున్నా, నా దువ్వాడను వదిలేయండి లేకపోతే: పోలీసులకు దివ్వెల మాధురి వార్నింగ్, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నన్ను ఎవరో ఒకరు కాపాడండి: నటి గాయత్రి గుప్త ఎమోషనల్ వ్యాఖ్యలు

Chiranjeevi'158: ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన చిరంజీవి 158 చిత్రం

NBK112: నారా లోకేష్ అతిథిగా నందమూరి బాలకృష్ణ 112 చిత్రం

Tej Sajja: హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్ : సాయి దుర్గ తేజ్

Allani Sridhar: పిల్లల సినిమాలులేవనే బాధ వుంది;.ఏఐ టెక్నాలజీ 24 క్రాఫ్ట్స్‌ని కిల్‌ చేయదు : అల్లాణి శ్రీధర్‌

Show comments