Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు పాడయిపోయాయా? వాటిని మొక్కలకు పోసి చూడండి

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (23:05 IST)
కొన్నిసార్లు మనం కొనుక్కొచ్చిన ప్యాకెట్ పాలు పాడయిపోతాయి. పాలు పాడైపోయాయి కదా ఇంకెందుకని పారబోస్తారు చాలామంది. అలా పారబోయకుండా మొక్కలకు పిచికారీ చేస్తే అవి బ్రహ్మాండంగా వుంటాయట. పాలలో అధికంగా ఉండే కాల్షియం కంటెంట్ మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. మొక్కలను కుళ్ళిపోకుండా చేస్తుంది. పాలలో అవసరమైన ప్రోటీన్లు, విటమిన్ బి కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి మొక్కల మొత్తం ఆరోగ్యానికి మంచివి.
 
ఐతే మొక్కలపై పాలు ఎలా ఉపయోగించాలి?
ఒక భాగం పాలకు ఒక భాగం నీటిని కలపండి. ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌ లోకి తీసుకోవాలి. మొక్కల ఆకులపై మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. పాలు అన్నీ గ్రహించబడ్డాయో లేదా తెలుసుకునేందుకు ఓ అర్థ గంట తర్వాత చూడండి. ఆకులపైన లేదంటే కాండంపైన ఎక్కడైనా పాలు మిగిలి వున్నట్లు కనిపిస్తుంటే ఓ వస్త్రాన్ని తీసుకుని తుడిచేయండి. అవి మొక్కలపై అలాగే వుంటే ఫంగల్ ప్రతిచర్యకు దారితీస్తుంది.
 
మొక్కలకు పాలు ఉపయోగిస్తున్నప్పుడు ఇంకా ఏమి జాగ్రత్త తీసుకోవాలి?
అధిక పాలను వాడకుండా ఉండాలి, అలా వాడితే పాలలోని బ్యాక్టీరియా పెరుగుదల మొక్కకు హాని చేస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments