Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు ఓవర్‌లోడ్‌ వద్దే వద్దు..!

వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దామా..

Webdunia
సోమవారం, 13 జూన్ 2016 (15:49 IST)
వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు ఉతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దామా..  
 
బట్టలు వాషింగ్‌ మెషీన్‌లో వేసేటప్పుడు మిషన్‌పై బట్టలకు సంబంధించి ఉన్న సింబల్స్‌ను జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే బట్టల్లో ఎన్నో రకాల ఫ్యాబ్రిక్‌లు ఉంటాయి. ఏ రకం ఫ్యాబ్రిక్‌ని ఏ టెంపరేచర్‌లో ఉతకాలి అన్న విషయాలను ముందుగా తెలుసుకోవాలి. ముదురు రంగు ఉన్న బట్టలను వాషింగ్‌ మెషీన్‌లో విడిగా వేసి ఉతకాలి. లేకపోతే మిగతా బట్టలకు వాటి రంగు అంటుకునే ప్రమాదం ఉంది.
 
వాషింగ్‌ మెషీన్‌లోని రకరకాల సెట్టింగ్స్‌ని కూడా జాగ్రత్తగా వాడాలి. ఉదాహరణకు కొన్ని రకాల సిల్కు బట్టలకు, ఎంబ్రాయిడరీ బట్టలకు రెగ్యులర్‌ స్పిన్‌ సైకిల్‌ ఉపయోస్తే బట్టలు పాడయ్యే ప్రమాదం ఉంది.పరిమితికి మించి బట్టలను వాషింగ్‌ మిషన్‌లో వేసి ఉతకడానికి ప్రయత్నించకండి. ఓవర్‌లోడ్‌ వల్ల మెషిన్‌ డ్రమ్‌ దెబ్బతినే అవకాశం ఉంది. 
 
బట్టలను డ్రయ్యర్‌లో వేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అన్ని రకాల బట్టలనూ డ్రైయ్యర్‌లో వేయకూడదు. బట్టలు ఉతకడానికి బ్లీచింగ్‌ పౌడర్‌ చాలా మంది ఉపయోగిస్తుంటారు. అలా చేయడం వల్ల బ్లీచింగ్‌లోని కెమికల్స్‌ వల్ల బట్టలు పాడయ్యే ప్రమాదం ఉంది. బట్టలు వాషింగ్‌ మెషీన్‌లో వేసేటప్పుడు వాటిని సిల్కు, కాటన్‌, వులెన్‌ అని గ్రూపులుగా విడగొట్టి వేసుకోవాలి. ఇలా చేస్తే ఫ్యాబ్రిక్స్‌కి తగ్గట్టు డిటర్జెంట్‌ పౌడర్‌ ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఉతికే బట్టలను బట్టి టెంపరేచర్స్‌ను కూడా సెట్‌ చేసుకోవచ్చు.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments