మహిళలకు గౌరవం ఇచ్చి తీరాల్సిందే.. అదెలాగో తెలుసుకోండి!

Webdunia
గురువారం, 10 జులై 2014 (19:11 IST)
అనాదిగా మహిళలకు గౌరవం ఇచ్చే సంస్కృతి మనది. కొన్ని జాఢ్యాల వల్ల మూఢత్వం పెరిగి మహిళల పట్ల చిన్నచూపు చూడటం ప్రారంభమైంది. ఫలితంగా ఎన్నో ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన ఉదాహరణగా లింగ నిష్పత్తిలో మార్పులు చోటు చేసుకోవడాన్నే చెప్పుకోవచ్చు. ఇదే సెక్స్ రేషియో కొనసాగితే మాత్రం మున్ముందు మరిన్న ఇక్కట్లు తప్పవు. అందుకే సమాజంలో మహిళలకు తగిన గౌరవంతో పాటు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ప్రతి పురుషునిపై ఉందని చెప్పడమే కాకుండా పురుష లక్షణంగా చెప్పుకోవచ్చు. 
 
మన ఇంటి స్త్రీ అయినా.. పరాయి మహిళ అయిన సరే వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చితీరాల్సిందే. ఇందుకోసం చిన్నచిన్న విషయాలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని ఒకసారి పరికిద్దాం.
 
మీ సహ ఉద్యోగి మహిళ అయితే సమావేశ మందిరానికి వెళ్లే సమయంలో ఆమెకు మొదట అవకాశం ఇవ్వాలి. మహిళలు వారి పనులు వారు చేసుకునేలా ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల పురుషులకు కాస్త శ్రమ తగ్గడమేకాకుండా మహిళలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఉపకరిస్తాయి. 
 
మన ఇంటిలోని మహిళలు ఎవరైనా కావొచ్చు. వారు చెప్పే మాటలను అంత తేలికగా తీసుకోకుండా తగిన విలువ ఇవ్వాలి. వర్కింగ్ ఉమెన్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించరాదు. ప్రధానంగా వంట కేవలం మహిళల బాధ్యత అని అనుకోరాదు. 
 
ఒకవేళ మీకు వంట రాకపోతే కూరలు తరగడం వంటి సహాయం చేయాలి. పైపెచ్చు మహిళలు ఉద్యోగం చేయడం వల్ల మీ కుటుంబానికి ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. అందువల్ల వారిని ఉద్యోగాలకు ప్రోత్సహించడం అలవర్చుకోవాలి. 
 
ఇలా చిన్న చిన్న సహాయాలు చేస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటే వారిని గౌరవించినట్టుగా మాత్రమే వారి పట్ల మర్యాదగా ప్రవర్తించినట్టుగా కూడా వారు భావిస్తారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజస్థాన్‌లో దారుణం : నలుగురిని హత్య చేసి దహనం చేసిన మాజీ సర్పంచ్ మొదటి భార్య

నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు