ఆఫీసుల్లో కూర్చునే చోట మంచి నీళ్ల సీసా వద్దు

ఆఫీసుల్లో గంటల పాటు కూర్చునే మహిళలు ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఉద్యోగం, ఇల్లు ఇలా రెండు పనులు చేసుకుంటూ.. వ్యాయామానికి సమయం లేదని చాలామంది మహిళలు అంటున్నారు. ఈ క్రమంలో బరు

Webdunia
ఆదివారం, 12 ఆగస్టు 2018 (13:30 IST)
ఆఫీసుల్లో గంటల పాటు కూర్చునే మహిళలు ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఉద్యోగం, ఇల్లు ఇలా రెండు పనులు చేసుకుంటూ.. వ్యాయామానికి సమయం లేదని చాలామంది మహిళలు అంటున్నారు. ఈ క్రమంలో బరువు పెరిగినా పట్టించుకోరు. పనులపై దృష్టి పెట్టి అనారోగ్యాలు తెచ్చుకుంటారు. అలాంటి వారు మీరైతే... ఈ కథనం చదవండి 
 
ఆఫీసుల్లో గంటలు గంటలు కూర్చునేవారు పవర్‌ వాక్‌ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. కాసేపు నిదానంగా, మరికాసేపు వేగంగా.. నడవడం అలవాటు చేసుకోవాలి. కూర్చునే చోట మంచినీళ్ల సీసా అందరూ పెట్టుకుంటారు. నిజానికి సీసా పెట్టుకోకుండా దాహం వేసిన ప్రతిసారీ ప్యాంట్రీకి వెళ్లి తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా మాటిమాటికీ చేస్తే వ్యాయామం చేసినట్లవుతుంది. 
 
పనిమీద శ్రద్ధ పెట్టడం వల్ల ధ్యాస మిగతా వాటి మీద ఉండదు. అందుకే గంటకోసారి అలారం పెట్టుకోవాలి. ఫిట్‌నెస్‌ కోసం పెట్టుకున్న ఈ అలారం మోగినప్పుడు చేతులు లేదంటే కాళ్లూ, మెడా కదుపుతూ ఉండాలి. ఇక గంటల పాటు కూర్చునే వారు అవిసెగింజలూ, బాదం, ఖర్జూరం, నట్స్‌ వంటివి ఆఫీసు ర్యాకులో పెట్టుకోవాలి. ఇవి తక్షణశక్తిని అందిస్తాయి. గ్యాస్‌ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మందుబాబులను నడిరోడ్డుపై నడిపిస్తూ మత్తు వదలగొట్టారు...

తెలంగాణ రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ : హరీశ్ రావు ధ్వజం

అంధకారంలో వెనెజువెలా రాజధాని - మొబైల్ చార్జింగ్ కోసం బారులు

చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల బాలికపై అత్యాచారం

వెనెజువెలా అధ్యక్షుడి నిర్భంధం.. ఇక మీ వంతేనంటూ ప్రత్యర్థులకు ట్రంప్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suri: సూరి, సుహాస్ సెయిల్ బోట్ రేసింగ్ కథతో మండాడి చిత్రం

Vijay Sethupathi : పొట్టేలుతో శిక్షణ తీసుకొని నటించిన మూవీ జాకీ - టీజర్ విడుదల చేసిన విజయ్ సేతుపతి

Dance Festival: సౌజన్య శ్రీనివాస్ నృత్య ప్రదర్శనతో వైభవంగా భావ రస నాట్యోత్సవం - సీజన్ 1

ప్రభాస్‌తో నిధి అగర్వాల్.. ఆసక్తికర ఫోటో షేర్

టైమ్ మెషీన్‍‌లో ఒక రౌండ్ వేసి వింటేజ్ చిరంజీవిని చూస్తారు : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments