జుట్టు మృదుత్వానికి కొన్ని చిట్కాలు

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2016 (11:17 IST)
జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ హెయిర్‌ స్టైల్స్‌ కోసం వాడే కొన్ని రకాల రసాయనాలు, కాలుష్యం వంటి వాటివల్ల జుట్టు చిట్లిపోవడం, మృదుత్వాన్ని కోల్పోవడం, రాలిపోవడం జరుగుతుంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల  జుట్టుని ఆరోగ్యంగా కాపాడుకోవడమేకాకుండా సిల్కీగా కూడా ఉంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెల్సుకుందాం!
 
ఒక కప్పులో గుడ్డు సొన తీసుకొని దీనిలో రెండు టీస్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ని కలపాలి. దీన్ని జుట్టుకి పట్టించి అర్థగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నల్లగా మెరవడంతోపాటు చాలా సిల్కీగా తయారవుతుంది.
 
తలస్నానం చేసేటప్పుడు షాంపూలో కొద్దిగా కలబంద గుజ్జుని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారి చిట్లిపోకుండా ఉంటుంది.
 
కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి మరిగించాలి. అది చల్లారిన తర్వాత తలకు మర్దనా చేసుకొని గోరు వెచ్చని నీటితో తడిపిన టవల్‌ని అర్థగంట పాటు జుట్టుకి చుట్టుకోవాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు నల్లగా మెరవడమేకాకుండా మృదువుగా తయారవుతుంది.
 
యాపిల్‌ గుజ్జుని జుట్టుకి రాసుకోవడం వల్ల కూడా జుట్టు మృదువుగా మారుతుంది. ఈ గుజ్జుని తలకి రాసుకొని అర్థగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు వత్తుగా తయారవుతుంది.
 
ఒక కప్పు పెరుగులో కొద్దిగా ఆవనూనె, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకొని అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌పై సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు : డోనాల్డ్ ట్రంప్

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా : తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక - నేడు అమరజీవి విగ్రహావిష్కరణ

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక- Statue of Sacrifice విగ్రహావిష్కరణ ఆహ్వానం

సేవా కార్యక్రమాల్లో వచ్చే సంతృప్తి వేరు : నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

Ustaad Bhagat Singh: ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి కలగలిపిన ట్రైలర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆకట్టుకున్నాడు

మేడ్ ఇన్ కొరియా చిత్రీకరణ ఆనందించదగ్గ అనుభవం : ప్రియాంక మోహన్.

S.P. Charan: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

Rashmika: విజయ్ దేవరకొండ కోసం పోరాటం చేసిన రష్మిక మందన్న వీడియో రీరిలీజ్

Show comments