Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలా? నట్స్, ఫ్రూట్సే బెస్ట్!!

మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. దీనినే ఎండోమెట్రిక్‌ క్యాన్సర్‌ అని కూడా అంటారు. గర్భాశయ క్యాన్సర్‌‌కు అధిక రక్తస్రావం, నెలసరి సమయాల్లో కడుపునొప్పి, నెల

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (09:50 IST)
మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. దీనినే ఎండోమెట్రిక్‌ క్యాన్సర్‌ అని కూడా అంటారు. గర్భాశయ క్యాన్సర్‌‌కు అధిక రక్తస్రావం, నెలసరి సమయాల్లో కడుపునొప్పి, నెలసరి ముగిసినా శరీర బరువు పెరగడం వంటివి ప్రధాన లక్షణాలు. వంశపారంపర్యంగానూ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా శరీరంలో చక్కెర శాతం పెరిగినా, బరువు పెరిగినా గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అయితే గర్భాశయ క్యాన్సర్‌ను దూరం చేసుకోవాలంటే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించుకోవాలి. కాయగూరలను అధిక శాతంలో తీసుకోవాలి. పచ్చిబఠాణీలను ఆహారంలో చేర్చుకోవచ్చు. రోజూ వారీ డైట్‌లో పండ్లను తీసుకోవాలి. ఉడికించిన కూరగాయలను తీసుకోవచ్చు. కానీ పీచు పదార్థాలు అధికంగా ఉండేవి తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాయగూరల్లో క్యాబేజీ, కాలిఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవచ్చు. 
 
అలాగే పసుపు, ఎరుపు రంగు పండ్లను అధికంగా తీసుకుంటూ వుండాలి. వీటిద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆపిల్, నిమ్మపండు, టమోటా, బత్తాయి పండ్లలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అలాగే బాదం, పిస్తా వంటి నట్స్ కూడా తీసుకోవచ్చు. చేపలు అధికంగా తీసుకోవచ్చు. అయితే చేపలు వేపుడు రూపంలో గాకుండా ఉడికించి తీసుకోవాలి. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments