నా వక్షోజాలను అందంగా మలుచుకునే మార్గాలేంటి?

Webdunia
సోమవారం, 16 జూన్ 2014 (12:39 IST)
నేను ముంబైలో నివశిస్తున్నా. నేను చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాను. కానీ, నా వక్షోజాలు మాత్రం అందవిహీనంగా ఉన్నాయి. దీనికి కారణం ఒక వక్షోజం పెద్దదిగానూ, రెండోది చిన్నదిగావుంది. దీంతో రెండింటిని కవర్ చేసేలా ప్రత్యేకమైన బ్రాను వేసుకుంటున్నా. నా రెండు వక్షోజాలు ఒకే సైజులో ఉండాలంటే ఏం చేయాలి. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే సరిపోతుందా. సలహా ఇవ్వండి. ప్లీజ్. 
 
సాధారణంగా శృంగారం విషయంలో మహిళల్లో ఎక్కువ ఆకర్షణీయమైన శరీరంలో మొదటి స్థానం వక్షోజాలకే దక్కుతుంది. వక్షోజాల తర్వాతే ముఖ, శరీరాకృతి, రంగు ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటుంటారు. నిండైన హృదయ అందాలు ఉన్న స్త్రీలలో సెక్సప్పీల్ చూడముచ్చటగా ఉంటుంది. అందుకే సినిమా స్టార్స్, మోడల్స్ ఇతర విషయాలతో పాటు శరీర సౌష్టవం, ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. 
 
అయితే, వక్షోజాల పరిమాణం ఒక్కో స్త్రీలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వక్షోజాల ఆకృతిని, పరిమాణాన్ని మార్చుకునేందుకు ఎన్నో చికిత్సలు నేడు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని రకాల ఇంజెక్షన్లు వక్షోజాల సైజును పెంచేందుకు వాడుతుంటారు. వీటివల్ల కొంతమేరకు ఉపయోగం ఉన్నప్పటికీ మున్ముందు దుష్ఫలితాలు లేకపోలేదని కొంతమంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 
 
వక్షోజాల పరిమాణాన్ని పెంచేందుకు ఇంజక్షన్లు, మందులు కాకుండా మరికొన్ని మార్గాలున్నాయి. అవి ప్లాస్టిక్ సర్జరీ, సిలికాన్ ఇంప్లాంట్స్ వంటివి. దీనివల్ల పరిమాణంలో మార్పు కనిపిస్తుంది. ఇదంతా ఖరీదైన వ్యవహారం. అందరికీ అందుబాటులో ఉండదు. ఖరీదుకు వెరవకుండా ఉంటే అపుడా విధానాలు అనుసరించవచ్చు. 
 
ఇవికాకుండా.. సహజ పద్దతుల్లో కూడా ఈ సైజులను పెంచుకోవచ్చు. అంటే... పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, కొవ్వు ఎక్కువగా ఉన్న నెయ్యి, నూనెలు వాడటం వల్ల వక్షోజాల సైజును పెంచుకోవచ్చని చెపుతున్నారు. దీనివల్ల శరీరంలో అదనంగా చేరే కొవ్వు వల్ల వక్షోజాల పరిమాణం కొద్దిగా మారే అవకాశం ఉందట. 
 
అదేసమయంలో వక్షోజాలు చిన్నవిగా ఉండడానికి హార్మోన్ల లోపమే కారణమంటున్నారు. ఇటువంటి వారు హార్మోన్ల చికిత్స చేయించుకుంటే సత్ఫలితాలు కనిపిస్తాయి. మొదటి నుంచి వక్షోజాలు పెరగని వారికి కూడా ఈ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుందని వైద్యులు చెపుతున్నారు. వక్షోజాల ఎదుగుదలలో లోపం, సరైన వయస్సుకు రజస్వల కాకపోవడం, అండాలు సరిగా విడుదల కాకపోవటం ఇటువంటి వాటిలో కొన్నివున్నాయి. 
 
అలాగే, వ్యాయామం వల్ల చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకోవచ్చు కానీ వక్షోజాల ఆకృతి మార్చడం, పెద్దవి చేయడం కుదరదు. స్త్రీలు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే వక్షోజాల ఆకృతి అన్ని వయస్సులో ఒకే విధంగా ఉండదు. వయస్సును బట్టి, ఇతర కారణాలను బట్టి మారుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. 
 
వక్షోజాలు చిన్నవిగా ఉన్నంత మాత్రాన నిరాశలో కూరుకుపోయి, ఆకర్షణలేదనుకోవడం ఎక్కువగా టీనేజ్ యువతులలో కనబడుతుంది. ఆత్మవిశ్వాసమే అసలైన ఆకర్షణ అని గ్రహిస్తే ఇటువంటి యువతులు పడే మానసికవేదన తగ్గడమే కాదు, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నఇటువంటి వారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షించవచ్చని మానసిక వైద్యులు చెపుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

Show comments