Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిపాల వారోత్సవం... బాలింతలలో పాలు పెరగాలంటే...

చాలామంది తల్లులు తమ పిల్లలకు సరిపోయినన్ని పాలు ఇవ్వలేక పోతున్నామని మథనపడిపోతుంటారు. పోత పాలకు అలవాటు చేస్తుంటారు. తల్లిపాలు ఎక్కువవడానికి ఎంత ఎక్కువసార్లు పాలు పడితే అంత ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి. ఇందుకోసం బాలింతలు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతు

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (16:37 IST)
చాలామంది తల్లులు తమ పిల్లలకు సరిపోయినన్ని పాలు ఇవ్వలేక పోతున్నామని మథనపడిపోతుంటారు. పోత పాలకు అలవాటు చేస్తుంటారు. తల్లిపాలు ఎక్కువవడానికి ఎంత ఎక్కువసార్లు పాలు పడితే అంత ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి. ఇందుకోసం బాలింతలు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 
 
బాలింతలు వాము కషాయం రోజూ తేనెతో తీసుకుంటే చక్కని పాలు పడతాయి. అంతే కాదు గర్భాశయం త్వరగా కుంచించుకుంటుంది. గర్భాశయంలో నొప్పి తగ్గుతుంది. బొప్పాయి దోరగా ఉన్నదాన్ని కొబ్బరి కోరులా చేసి కూర వండుకుని తింటే స్తన్య వృద్ధి కలుగుతుంది. తన పాలు దోషయుక్తంగా ఉండి బిడ్డకు వికారం, విరేచనాలు కల్గిస్తున్నప్పుడు, బొప్పాయి కాయను గానీ పండుని గానీ తీసుకోవడం మంచిది. 
 
బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆముదం ఆకులపైన ఆముదాన్ని రాసి వేడిచేసి రొమ్ములకు కడితే పాలచేపు వస్తుంది. పాల ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని మార్గాలున్నాయి. ఆవుపాలు, కర్బూజా పండు, పాలకూర, జీలకర్ర, బార్లీజావ, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, ములగాకు కూరలు చాలా మేలు చేస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

యూఎస్ ఎన్నికలు 2024: ట్రంప్, హారిస్‌లలో ఎవరిది ముందంజ? సర్వేలు ఏం చెబుతున్నాయి?

అసలు వెన్నెముక ఉందా లేదా? సూర్య నమస్కారాలు వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర (video)

సీఐడీ చేతికి కాదంబరి జెత్వాని కేసు.. దర్యాప్తు పునః ప్రారంభం

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా బి.ఆర్.నాయుడు

తల్లికి ఉరేసింది.. ఆపై ఉరేసుకుంది.. అమ్మ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడిగా ప్రిన్స్ మహేష్ బాబు

జనరల్‌గా హీరోయిన్‌కి స్పేస్ ఉండదు - పర్సనల్‌గా నాకు రాకెట్ ఇష్టం: రుక్మిణి

50 ఏళ్ల 50 కేజీల తాజమహల్ బ్యూటీ 'ఐష్' బాలీవుడ్ హీరోతో పట్టుబడిందట

హనుమాన్‌గా రిషబ్ శెట్టి జై హనుమాన్ ఫస్ట్ లుక్ విడుదల

నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్

తర్వాతి కథనం
Show comments