Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ స్త్రీలు కొత్తిమీరను తీసుకుంటే?

Webdunia
సోమవారం, 20 మే 2019 (17:22 IST)
మనం నిత్యం కూరల్లో, రసంలో వాడే ధనియాల వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎన్నో వ్యాధులకు ఔషధంలా పని చేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ధనియాలతో కషాయం చేసుకుని దానిలో పాలు కలుపుకుని త్రాగితే నిద్ర బాగా పడుతుంది. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి మెత్తగా నూరుకుని చిన్నచిన్న గుళికల్లా చేసుకుని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. 
 
గర్భిణీ స్త్రీలు రోజూ తీసుకునే ఆహారంలో ధనియాలు చేర్చుకుంటే ప్రసవించిన సమయంలో గర్భకోశానికి మేలు కలుగుతుంది. ధనియాలను శుభ్రం చేసి తగినంత ఉప్పు వేసి దోరగా వేయించి మెత్తటి పొడిగా చేసుకుని రోజూ కొద్దిగా తింటే అజీర్తి, పుల్లత్రేపులు, కడుపుబ్బరం తగ్గుతుంది. కడుపులో మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్దకం ఉన్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకుని త్రాగితే తగ్గిపోతుంది. 
 
పిల్లలకు తరచుగా వచ్చే దగ్గు, ఆయాసం పోవాలంటే ధనియాలలో బియ్యం కడిగిన నీటిని కలిపి మెత్తగా నూరి ముద్దగా చేసి కొద్దిగా పటిక బెల్లం జోడించి కొద్ది మోతాదులలో తినిపిస్తుంటే సరిపోతుంది. 
 
వేసవి కాలంలో అతి దాహం ఉన్నవారు ధనియాలు నానబెట్టి వడకట్టిన నీటిలో చక్కెర, పచ్చకర్పూరం వేసుకుని త్రాగితే దాహం తగ్గుతుంది, ఆకలి కూడా బాగా వేస్తుంది. బీపీ షుగర్‌లను ధనియాలు నియంత్రిస్తాయి. ప్రతిరోజూ ధనియాలు తింటే, పిల్లలకు స్త్రీల ఆరోగ్యానికి చాలా మంచిది.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments