Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైరతాబాద్ శ్రీకైలాస విశ్వరూప మహాగణపతికి 5 టన్నుల లడ్డు

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (13:49 IST)
రేపు వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ శ్రీకైలాస విశ్వరూప మహాగణపతికి 5 టన్నుల లడ్డును తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి పంపేందుకు పంపుతున్నారు. 5,000 కిలోలు బరువున్న ఈ తాపేశ్వరం లడ్డును రూ. 15 లక్షల వ్యయంతో తయారు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ లడ్డును గవర్నర్ చేతులు మీదుగా గణేశునికి సమర్పించనున్నట్లు తెలియజేశారు.
 
ఏటేటా తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ ఈ ప్రసాదాన్ని సమర్పిస్తుంది. 2010లో 500 కిలోల లడ్డూతో ప్రారంభమైన ఈ ప్రసాద పంపిణీ ఈ ఏడాది 5000 కిలోలకు చేరిందని సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు తెలియజేశారు.
 
60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖైరతాబాద్ గణపతిని ఈ ఏడాది శ్రీకైలాస విశ్వరూప మహాగణపతిగా నామకరణం చేశారనీ, తాము ఈ నెల 21న తనతోపాటు 16 మంది గణేష్ మాల ధరించి మహాలడ్డూ తయారీ పనులు ప్రారంభించి పూర్తి చేసినట్లు వెల్లడించారు. లడ్డూను భారీ ట్రాలీపై ఊరేగింపుతో ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్ తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments