వినాయక చవితి స్పెషల్ : కోకో నట్ లడ్డూ ఎలా చేయాలి

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2015 (15:56 IST)
వినాయక చవితి సందర్భంగా కొబ్బరి తురుముతో లడ్డూ ఎలా చేయాలో తెలుసుకుందాం.. సాధారణంగా కొబ్బరిలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. కొబ్బరి పాలు తల్లిపాలితో సమానం అంటారు.

కొబ్బరి హృద్రోగ వ్యాధుల్ని చాలామటుకు తగ్గిస్తుంది. రోగనిరోధకత పెంచుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణవ్యవస్థను పటిష్టపరుస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలెన్నో దాగివున్న కొబ్బరితో లడ్డూలు తయారు చేసిన పండగ పూట వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకుందాం.. 
 
కావలసిన పదార్ధాలు :
చిక్కటి పాలు - అర లీటరు 
పంచదార - అర కేజీ
పచ్చి కొబ్బరి తురుము - ఆరు కప్పులు 
ఏలకుల పొడి - అర టీ స్పూన్ 
జీడిపప్పు - ఒక కప్పు
 
తయారీ విధానం : 
ముందు స్టౌ మీద బాణలి పెట్టి పాలు, పచ్చి కొబ్బరి తురుము, పంచదార వేసి కలిపి సన్నని సెగపై చిక్కబడేవరకు కలుపుతూ ఉండాలి. రంగు మారి గట్టిపడుతున్నప్పుడు ఏలకుల పొడి... నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత నెయ్యి రాసిన ప్లేటులో ఈ మిశ్రమాన్ని వేసి, కొంచెం చల్లారాకా ఉండలు ఉండలుగా చేసి పక్కనబెట్టుకోవాలి. కావాలంటే మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. అంతే కొబ్బరి లడ్డూ రెడీ అయినట్లే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అనంత్ అంబానీ కోసం జాకబ్ అండ్ కో ప్రత్యేక వాచ్.. ధర ఎంతో తెలుస్తే నోరెళ్లబెడతారు

కేరళలో అధికార మార్పిడి తథ్యం : నరేంద్ర మోడీ

నా గుండె కోసం దెబ్బలు తగిలినా ఓర్చుకుంటున్నా: ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

18-01-2026 నుంచి 24-01-2026 వరకు వార రాశి ఫలితాలు

17-01-2026 శనివారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

Show comments