Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాగణపతిని 21 పత్రాలతో ఇలా ప్రార్థించండి

Webdunia
WD
మహాగణపతి, హరిద్రాగణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీతగణపతి అనే ఆరు రూపాలుగా పూజ లందుకుంటున్న విఘ్నేశ్వరునికి అన్ని పూజల్లోకెల్లా 21 పత్రాలతో చేసే పూజ అంటే మహా ప్రీతట. పత్రాలతో గణపయ్యను ఎలా ప్రార్థించాలంటే..

1. ఓం సుముఖాయ నమః మూచీపత్రం సమర్పయామ ి
మాచీపత్రి (చేమంతి జాతికి చెందినది. దీని ఆకులు సువాసనభరితంగా ఉంటాయి. చూసేందుకు చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి) కళ్లకు చలువ చేస్తుంది. తొలనొప్పిని పోగొడుతుంది. మనస్సుకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

2. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామ ి
బృహతీపత్రం అంటే... వంగ ఆకుల మాదిరి తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. ఈ చెట్టు ఆకులు శ్వాసకోస వ్యాధుల్ని నివారిస్తాయని పండితులు అంటున్నారు.

3. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామ ి
బిల్వపత్రమంటే.. మారేడు ఆకు. శివుడికి మహా ఇష్టమైన పత్రంతో గణపతిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఈ ఆకు నీళ్లలోని మలినాలను తొలగిస్తుంది.

4. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
పచ్చిక బయళ్ళలో లభించే గరిక చర్మవ్యాధుల్ని పోగుడుతుంది. తెల్లగరిక, నల్లగరిక అనే రెండు రకాలు కలవు. ఇందులో గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.

5. ఓం హరసూనవే నమ: దత్తూర పత్రం పూజయామ ి
దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఈ ఉమ్మెత్త ఆకులు ఎటువంటి విషాన్నైనా తొలిగిస్తాయి.

6. ఓం లంబోదరాయ నమ: బదరీ పత్రం పూజయామ ి
బదరీ పత్రం అంటే.. రేగు ఆకు. ఈ రేగు ఆకుల్ని ఆవులు నమిలితే బాగా పాలిస్తాయి. మనం నమిలితే గొంతులోని బాధలన్నీ తొలగిపోతాయి. రక్తదోషాలు ఉండవు.

7. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామ ి
అపామార్గ పత్రం అంటే.. ఉత్తరేణి ఆకు. ఈ ఉత్తరేణి ఆకులు పంటికి మంచివి.

8. ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామ ి
తులసి ఆకులు నీటిని, గాలిని శుద్ధి చేస్తుంది.

9. ఓం ఏకదంతాయనమః చూతపత్రం పూజయామ ి
చూతపత్రం అంటే మామిడి ఆకులు. ఇవి గొంతుబాధల్ని పోగొడతాయి.

10. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామ ి
శంఖు పత్రాలనబడే విష్ణుక్రాంత పత్రాలు జ్ఞాపకశక్తి, మేధోశక్తిని పెంచుతుంది.

11. ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామ ి
దాడిమీ పత్రాలంటే.. దానిమ్మ ఆకులు. ఇవి అతిసారాన్ని అరికడుతాయి.

12. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామ ి
దేవదారు పత్రం అంటే.. దేవతలకు ఎంతో ఇష్టమైన ఆకు. ఇది క్రిమికీటకాలను దగ్గరకు రానీయదు

13. ఓం ఫాలచంద్రాయనమః మరువక పత్రం పూజయామ ి
మరువం గుండెజబ్బులకు మంచి మందుగా పనిచేస్తాయి. ఈ పత్రాన్ని వాడుక భాషలో ధవనం, మరవం అంటారు. ఆకు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.

14. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామ ి
వావిలాకు పత్రాలనబడే సింధువార ఆకుల్ని విషానికి విరుగుడుగా వాడుతారు. ఈ ఆకు వాసనకు జ్వరాలు తగ్గుతాయి.

15. ఓం శూర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామ ి
అజీర్తిని హరించే పత్రం జాజిపత్రం

16. ఓం సురగ్రజాయ నమః గణ్డనేపత్రం పూజయామి
చర్మవ్యాధులకు ఈ మొక్కకు పూసే తెల్లని పువ్వులు పనిచేస్తాయి. వీటిని ఏనుగు చెవి ఆకులు అంటారు.

17. ఓం ఇభవక్ర్తాయ నమః శమీపత్రం పూజయామి
జమ్మి ఆకులనబడే శమీపత్రం అవాంఛీత రోమాల్ని తొలగించే ఔషదంగా ఉపయోగపడుతుంది

18. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామ ి
రావి ఆకులు, బెరడులో ఎన్నో ఔషధగుణాలున్నాయి.

19. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామ ి
మద్ది ఆకులనబడే అర్జున పత్రాలను గాయాలు సెప్టిక్ కాకుండా ఉంచుతాయి. పుండ్లు తగ్గిపోతాయి.

20. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి
జిల్లేడు ఆకులైన అర్కపత్రాలవు విషాలకు విరుగుడుగా ఉపయోగిస్తారు.

21. ఓం గణేశ్వరాయ నమః ఏకవిశంతి పత్రాణి పూజయామి... అంటూ విఘ్నేశ్వరుడిని వినాయక చతుర్థి నాడు పూజించే వారికి సకల సంపదలతో పాటు ఆ సంవత్సరమంతా విజయాలు వరిస్తాయని విశ్వాసం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

Show comments