వెజిటబుల్ స్వీట్‌కార్న్ మష్రూమ్స్ తయారీ ఎలా?

Webdunia
మంగళవారం, 12 ఆగస్టు 2014 (16:40 IST)
కావలసిన పదార్థాలు :
 
వెజిటబుల్ స్టాక్... ఒక లీటర్
పుట్టగొడుగులు (మష్రూమ్స్)... పదిహేను
స్వీట్‌కార్న్... మూడు
ఉప్పు... తగినంత
పంచదార... కొద్దిగా
మిరియాలపొడి... ఒక టీస్పూన్
కార్న్‌ఫ్లోర్... 3 టీస్పూన్లు
 
తయారీ విధానం :
 
ముందుగా వెజిటబుల్ స్టాక్‌ను మరిగించాలి. అందులో సన్నగా తరిగిన పుట్టగొడుగు ముక్కలు, సన్నటి ముక్కలుగా తరుక్కున్న స్వీట్‌కార్న్ ముక్కలను కూడా వేసి కాసేపు మరిగించాలి. ఈ ముక్కలు ఉడికిన తరువాత అందులోనే ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలియబట్టి మరికాసేపు ఉడికించాలి.
 
చివర్లో కార్న్‌ఫ్లోర్‌లో కొద్దిగా నీళ్లుపోసి పేస్టులాగా చేసి.. పైన ఉడుకుతున్న మిశ్రమంలోనే కలిపి దించేయాలి. సర్వింగ్ బౌల్స్‌లలో ఈ మిశ్రమాన్ని పోసి వేడి వేడిగా అతిథులకు అందించాలి. అంతే వెజిటబుల్ స్వీట్‌కార్న్ మష్రూమ్స్ రెడీ అయినట్లే..! ఎన్నో పోషకవిలువలు కలిగిన ఈ వంటకాన్ని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ..! 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

Show comments