Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటా పప్పుతో ఆరోగ్యానికి మేలెంతో తెలుసుకోండి?

Webdunia
శనివారం, 20 జూన్ 2015 (15:33 IST)
టమోటాలను వంటల్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. కంటి దృష్టి లోపాలను సరిచేసి, కంటి ఆరోగ్యానికి మేలు చేసే టమోటా.. లోబీపి నివారిస్తుంది. డయాబెటిస్‌, చర్మ వ్యాధులను, యూరినరీ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. అలాంటి టమోటా, పప్పుతో కూర ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
టమోటాలు - పావు కేజీ  
కందిపప్పు - పావు కేజీ 
పచ్చిమిర్చి ముక్కలు - నాలుగు 
కరివేపాకు, కొత్తిమీర తరుగు - అర కప్పు 
కారం - అర టీ స్పూన్
పసుపు - 1 చిటికెడు
పోపు - సరిపడినంత
ఎండు మిర్చి- 1 
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు 
ఇంగువ- చిటికెడు
నూనె, ఉప్పు, చింతపండు - తగినంత 
 
తయారీ విధానం :
ముందుగా కందిపప్పును బాగా ఉడికించాలి. సగానికి ఉడికిన తర్వాత.. టమోటా ముక్కలు, ఉల్లిపాయ తరుగు చేర్చుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, చింతపండు పులుసు పోసి ఉల్లిపాయ ఉడికేంతవరకు ఉంచి, అనంతరం బాణలి నూనె వేడయ్యాక పోపుగింజలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బ, ఇంగువ, కొత్తిమీర వేసి వేయించి పప్పులో వేసి బాగా కలిపి దించుకోవాలి. అంతే టమోటా పప్పు రెడీ.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments