ఈజీ అండ్ హెల్దీ.. టమోటో గ్రేవీ రిసిపీ ట్రై చేయండి..

Webdunia
మంగళవారం, 11 నవంబరు 2014 (13:22 IST)
టమోటో గ్రేవీ రిసిపీ రోటీ, బ్రెడ్, రైస్‌కు గుడ్ కాంబినేషన్. టమోటాలో ఆరోగ్యంతో పాటు సౌందర్య పోషకాలు ఎన్నో ఉన్నాయని సర్వేలు తేల్చాయి. అలాంటి హెల్దీ టమోటాతో టేస్టీ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
 
టమోటోల గుజ్జు : ఒక కప్పు 
ఉల్లిపాయల గుజ్జు : అరకప్పు 
పసుపు: కొద్దిగా 
ఆవాలు: సరిపడా
కరివేపాకు : రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
కొబ్బరి నూనె: సరిపడా
పచ్చిమిర్చి పేస్ట్  : ఒక టీ స్పూన్ 
కొబ్బరి తురుము: అర కప్పు 
కారం: ఒక టేబుల్ స్పూన్ 
 
తయారీ విధానం : 
ముందుగా పాన్ వేడయ్యాక నూనె వేసి వేడయ్యాక.. ఆవాలు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటో గుజ్జును చేర్చుకుని వాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాసింత నీరు చేర్చుకోవాలి. 
 
ఇంతలోపు మిక్సీలో కొబ్బరి తురుము, ఉల్లిపాయలు కొద్దిగా నీళ్ళు జోడించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఉడుకుతున్న టమోటో గ్రేవీ మిశ్రమంలో చేర్చుకోవాలి. 
 
తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని ఉడికించాలి. అలాగే ఇందులో నీళ్ళు కూడా పోసం మరో 10 నిముషాలు ఉడికించుకోవాలి. అంతే సింపుల్ అండ్ ఈజీ టమోటో గ్రేవీ రిసిపి రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు

ఆధ్యాత్మిక వేడుకలో డ్యాన్స్ చేసిందనీ.. భార్యను, పిల్లలను నరికి చంపేసిన భర్త

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు : యూఎస్‌ స్థావరాలపై ఇరాన్‌ ఆపరేషన్

అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. లైంగిక సేవల పేరుతో స్పెషల్ వీడియో - కేసు నమోదు

రౌడీ షీటర్ సాయికృష్ణ కేసు : పత్తాలేని కృష్ణలంక హెడ్ కానిస్టేబుళ్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

Show comments