Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటా, వంకాయ గ్రేవీ టేస్ట్ చేశారా?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2015 (16:13 IST)
వంకాయ, టమోటా కాంబినేషన్‌లో కర్రీ టేస్ట్ చేశారా..? అయితే ట్రై చేయండి. వంకాయలో ఆరోగ్యానికి అవసరమయ్యే ఐరన్, ఫైబర్, సోలబుల్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు, పర్ఫుల్ కలర్ వెజిటేబుల్ క్యాన్సర్‌తో పోరాడుతాయి. డయాబెటిస్‌ను దూరం చేస్తాయి. క్యాలరీలను తగ్గిస్తాయి. మరి రుచికరమైన వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...
 
కావల్సిన పదార్థాలు: 
వంకాయ ముక్కలు : రెండు కప్పులు 
ఉల్లిపాయ తరుగు : ఒక కప్పు 
ఆయిల్  : తగినంత 
టమాటో తరుగు : రెండు కప్పులు 
కారం, ఉప్పు : తగినంత 
దాల్చిన చెక్క : చిన్నముక్క 
పసుపు పొడి : ఒక టీ స్పూన్ 
జీలకర్ర పొడి : ఒక టీ స్పూన్ 
గరం మసాలా : ఒక టీ స్పూన్ 
కొత్తిమీర తరుగు : అర కప్పు
పచ్చి బఠాణీలు (ఉడికించినవి) - అర కప్పు
 
తయారీ విధానం :
ముందుగా వంకాయలను ముక్కలుగా కట్ చేసుకుని నీటిలో కాసేపు ఉంచి తర్వాత తీసి పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఉల్లి, వెల్లుల్లి వేసి దోరగా వేయించాలి. అందులో సన్నగా తరిగిన టమోటో, వంకాయ ముక్కలు వేసి మరో 5నిముషాలు ఫ్రై చేయాలి.

తర్వాత కొద్దిగా నీరు, కారం, ఉప్పు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి, మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలియబెట్టి, తర్వాత మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి. పదినిమిషాల తర్వాత పూత తీసి, అందులో ముందుగా ఉడికించుకొన్న పచ్చిబఠాణీలను వేసి, మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి అంతే గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించి దించేయాలి. అంతే వంకాయ టమాటా కర్రీ రెడీ.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments