అరటి కోఫ్తా ఎలా చేయాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 20 జనవరి 2015 (12:18 IST)
అరటికాయలో చాలా వెరైటీలు చేసేస్తాం.. అలాంటి అరటిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రిస్తాయి. బరువును నియంత్రిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గిస్తాయి. అలాంటి అరటి కాయతో టేస్టీ కోఫ్తా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు :
అరటికాయలు : రెండు 
అల్లం పేస్ట్ : అర స్పూన్
వెల్లుల్లి పేస్ట్ : అర స్పూన్ 
గరం మసాలా పౌడర్ : అర స్పూన్ 
పసుపు పొడి : ముప్పావు స్పూన్ 
కారం : ముప్పావు స్పూన్ 
కోడిగుడ్డు : ఒక టి 
శనగపిండి : ముప్పావు స్పూన్ 
పంచదార : ముప్పావు స్పూన్
ఉప్పు : తగినంత 
నూనె : సరిపడా 
 
తయారీ విధానం : 
ముందుగా అరటికాయలను తొక్క తీయకుండా ఉడికించుకోవాలి. తర్వాత తొక్క తీసి ఒక పాత్రలో పెట్టుకోవాలి. నూనె కాకుండా మిగతా పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. ఒకవేళ శనగపిండి అవసరమైతే మరికొంత వేసుకోవచ్చు. 
 
తర్వాత ఒక పాత్రలో నూనె పోసి వేడి చేసుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుంటూ నూనెలో వేసి ఫ్రై చేయాలి. గోల్డెన్ రంగు వచ్చే వరకు ఫ్రే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిశ్రమం మొత్తాన్ని ఉండలుగా చేసుకుని ఫ్రై చేసుకోవాలి. 
 
తర్వాత మిగిలిన నూనెలో జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కారం, పంచదార వేసుకోవాలి. అరకప్పు నీరు పోసి కాసేపయ్యాక మసాలా వేయాలి. ఇప్పుడు రెండు కప్పుల నీరు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించుకోవాలి. చివరగా ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తాలను వేసుకుని రెండు, మూడు నిమిషాలు ఉంచాలి. అంతే బనానా కోఫ్తా రెడీ. రోటీలకు, వైట్ రైస్‌కు ఈ కోప్తా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

Show comments