Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్తీ స్నాక్.. మష్రూమ్ టోస్ట్ ఎలా చేయాలంటే..?

Webdunia
మంగళవారం, 24 మే 2016 (17:58 IST)
మష్రూమ్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా..? మష్రూమ్‌ను వారానికి ఓసారి ఆహారంలో తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ లెవల్స్ క్రమబద్ధీకరింపబడుతాయి. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, డయాబెటిస్, ఒబిసిటీని దూరం చేస్తాయి. బరువును తగ్గించడంలో మష్రూమ్స్ సూపర్‌గా పనిచేస్తారు. ఇంకా శరీరానికి బలం చేకూర్చి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అలాంటి మష్రూమ్స్‌తో స్నాక్స్ రిసిపీ మష్రూమ్ టోస్ట్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
వీట్ బ్రెడ్ - ఆరు ముక్కలు 
చీజ్ - అర కప్పు 
మష్రూమ్స్ ముక్కలు - ఒక కప్పు 
ఉల్లి తరుగు - అర కప్పు 
క్యాప్సికమ్ - అర కప్పు 
టమోటా తరుగు - అర కప్పు 
నూనె, ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా వెడల్పాటి పాన్‌ను స్టౌ మీద పెట్టి పాన్ వేడయ్యాక అందులో బ్రెడ్ ముక్కలను ఇరువైపులా దోరగా వేయించుకుని పక్కనబెట్టుకోవాలి. తర్వాత మరో బాణలిని స్టౌ మీద పెట్టి వేడయ్యాక నూనె పోసి, అందులో ఉల్లి, టమోటా, క్యాప్సికమ్, మష్రూమ్స్ చేర్చి ఐదు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఉప్పు చేర్చుకోవాలి.

ఈ మిశ్రమాన్ని టోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కలపై ఉంచి.. దానిపై చీజ్ తురుమును చేర్చి ఓవెన్‌లో 2-3 నిమిషాల పాటు (చీజ్ కరిగేదాక) ఉంచి సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి. అంతే మష్రూమ్ టోస్ట్ రెడీ అయినట్లే. ఈ టోస్ట్‌ను టమోటా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments