Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం స్పెషల్ "పుట్టగొడుగుల ఫ్రై"

Webdunia
మంగళవారం, 8 జులై 2014 (18:50 IST)
మహిళలకు మష్రూమ్ ఎంతో మేలు చేస్తుంది. గర్భసంచికి ఎంతో మేలు చేసే మష్రూమ్‌లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఐరన్, క్యాల్షియం, తక్కువ కెలోరీలను డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కూడా తీసుకోవచ్చు. అలాంటి మష్రూమ్‌తో పిల్లలకు నచ్చేలా ఫ్రై ఎలా చేయాలో ట్రై చేద్దామా.. 
 
కావలసిన పదార్థాలు : 
పుట్టగొడుగులు : 400 గ్రాములు
ఉల్లిపాయలు : 100 గ్రాములు
వేయించిన వెల్లుల్లి : 30 గ్రాములు
వేయించిన జీడి పప్పు : 50 గ్రాములు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి : 10 గ్రాములు
సన్నగా తరిగిన అల్లం : 10 గ్రాములు
యాలకుల పొడి : 4 గ్రాములు
నెయ్యి : 100 గ్రాములు
ఉప్పు : తగినంత
 
తయారు చేసే విధానం: 
ముందుగా పుట్టగొడుగులను శుభ్రం చేసుకొని, కాడలు వొలిచి పక్కన పెట్టుకొని బాగా ఆరనివ్వాలి. ఓ పాత్రలో పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి తరిగిన అల్లం, పచ్చిమిర్చి, యాలకుల పొడి, కొద్దిగా నీరు తగినంత ఉప్పు వేసి బాగా కలవనివ్వాలి.
 
తర్వాత స్టవ్ మీద వెడల్పాటి లోతు లేని నాన్ స్టిక్ పాన్‌ను పెట్టి నెయ్యిని వేడి చెయ్యాలి. ఈ లోగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని తడి చేతులతో చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఈ ముద్దలను నేతిలో దోరగా వేయించుకొని వేరే పళ్లెంలోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చెయ్యండి. ఈ ముష్రూమ్ ఫ్రైకి చిల్లీసాస్ లేదా టమోటా సాస్‌ను సైడిష్‌గా వాడుకోవచ్చు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments