Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెులకెత్తిన పెసలతో కూర ఎలా చేయాలో చూద్దాం...

పెసలలో ప్రొటీన్స్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. పెస‌ల‌లో విట‌మిన్ బి, సి, మాంగ‌నీస్ వంటి పోష‌కాలు స‌మృద్ధిగా ఉండ‌డం వ‌లన చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పెసలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ‌గా ఉండ‌డం

Webdunia
గురువారం, 26 జులై 2018 (14:21 IST)
పెసలలో ప్రొటీన్స్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. పెస‌ల‌లో విట‌మిన్ బి, సి, మాంగ‌నీస్ వంటి పోష‌కాలు స‌మృద్ధిగా ఉండ‌డం వ‌లన చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పెసలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌లన శ‌రీర రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పలు ర‌కాల క్యాన్స‌ర్స్ రాకుండా ఉంటాయి. ఇటువంటి పెసలతో కూర ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
పెసలు- ఒక కప్పు 
ఉల్లిపాయలు - 1 
టొమాటోలు - 2 
కారం - 1స్పూన్
జీలకర్ర, ధనియాలపొడి- 1/2 స్పూన్ 
గరంమసాలా - పావు స్పూన్ 
నూనె - సరిపడా 
కసూరి మెంతి- కొద్దిగా 
ఉప్పు- తగినంత
 
తయారీ విధానం:
ముందుగా పెసలు కడిగి రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‍‍‍‍‍‍‍‌లో నూనెను వేసి వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి నిమిషం పాటు వేగించాలి. తరువాత టమోటా ముక్కలను వేసి మరికాసేపు వేగించాలి. ఈ మిశ్రమంలో ధనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు నానబెట్టుకున్న పెసలను వేసి రెండున్నర కప్పుల నీళ్లుపోసి తగినంత ఉప్పు వేయాలి. ఆ తరువాత ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. చివరగా కసూరి మెంతి వేసి బాగా కలుపుకుని కొత్తిమీరను చల్లుకుంటే వేడివేడి పెసలు కూర రెడీ.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments